అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభణ... ఒక్కరోజే 4,470 మంది మృతి!

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభణకు పట్టపగ్గాల్లేకుండా పోతోంది. మంగళవారం ఒక్కరోజే 24 గంటల వ్యవధిలో ఏకంగా 4వేల 470 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా చరిత్రలో అత్యధిక సంఖ్యలో కరోనాతో నిమిషానికి ముగ్గురిపైనే చనిపోయారు. అగ్రరాజ్యంలో వైరస్ బారినపడి కొత్తగా లక్షా 31వేల మంది ఆస్పత్రుల్లో చేరారు. కరోనా వార్డుల్లో రోగులకు బెడ్లు సరిపోవడం లేదు. విదేశాల నుంచి వచ్చేవారికి 'కరోనా నెగెటివ్' రిపోర్టును అమెరికా తప్పనిసరి చేసింది. ఈ నెల 26 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.
అటు కొత్త స్ట్రెయిన్‌తో అల్లాడుతున్న యూకే సైతం కఠిన నిర్ణయాలు తీసుకుంది. విమానాలు, నౌకలు, రైళ్ల ద్వారా దేశంలోకి వచ్చే ప్రయాణికులకు 72 గంటల ముందుగా చేయించుకున్న కొవిడ్-19 నెగెటివ్ రిపోర్టును కచ్చితం చేసింది. నెగెటివ్ అయినప్పటికీ.. బ్రిటన్ చేరుకున్న అనంతరం 10 రోజులపాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే 500 పౌండ్ల జరిమానా ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది.
బీజింగ్‌లోనూ కొత్త కేసులు కేసులు నమోదయ్యాయి. హెబెయ్ ప్రావిన్స్ ప్రాదేశికతలోనే బీజింగ్ ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రావిన్స్‌లో కఠిన లాక్‌డౌన్ అమల్లో ఉంది. వచ్చే నెలలో లునార్ నూతన సంవత్సర సెలవులు రానున్న సందర్భంలో ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కరోనా పుట్టుకపై విచారణ జరిపేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం ఇవాళ చైనాలో పర్యటించనుంది. పదిమంది సభ్యుల బృందం సింగపూర్ నుంచి నేరుగా కొవిడ్-19 మొదలైన వూహాన్‌కు వెళ్లనుంది.అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభణ... ఒక్కరోజే 4,470 మంది మృతి!
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com