Israeli Strikes: పోలియో వేళ ఇజ్రాయెల్ దాడి..
ఒక వైపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి సన్నాహాలు జరుగుతుండగా ఇజ్రాయెల్ దళాలు శనివారం గాజా స్ట్రిప్‌పై దాడి చేశాయి. ఈ ఘటనలో 48 మంది మృతి చెందారు. 25 ఏండ్ల తర్వాత టైప్-2 పోలియో వైరస్ లక్షణాలు ఒక బాలుడిలో కన్పించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ 6.40 లక్షల మందికి పోలియో టీకాలు వేయాలని నిర్ణయించింది. తాత్కాలిక కాల్పుల విరమణలకు ఇజ్రాయెల్ దళాలు, హమాస్ అంగీకరించాయి. శనివారం 2 వేల మంది వైద్య సిబ్బంది వివిధ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌కు సన్నాహాలు ప్రారంభించారు. ఇంతలో, ఇజ్రాయెల్ దాడులు చేయడంతో 48 మంది మరణించారని తెలిసింది.
శనివారం, గాజా స్ట్రిప్‌లోని ఎనిమిది చారిత్రాత్మక శరణార్థుల శిబిరాల్లో ఒకటైన నుసీరత్‌లోని వైద్యులు ప్రచారం ప్రారంభానికి 2,000 మందికి పైగా వైద్య , కమ్యూనిటీ వర్కర్లు సిద్ధమవుతుండగా, ఇజ్రాయెల్ దాడుల్లో తొమ్మిది మంది సభ్యులతో సహా కనీసం 19 మంది మరణించారని వైద్యులు తెలిపారు. గాజాలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన వరుస దాడుల్లో మరో 30 మందికి పైగా మరణించారు. సెంట్రల్, దక్షిణ గాజా స్ట్రిప్‌లో తమ కార్యకలాపాలను కొనసాగించినట్లు ఇజ్రాయిల్ సైన్యం ఒక ప్రకటనలో తెలియజేసింది. పశ్చిమ రఫాలోని టెల్ అల్ సుల్తాన్‌లో తమ సైనికులు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు తెలిపింది.
దశాబ్ధాల నాటి ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదంలో అక్టోబర్ 07న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి చేయడంతో గాజా యుద్ధ ప్రారంభమైంది. ఈ దాడిలో హమాస్ మిలిటెంట్లు 1200 మంది ఇజ్రాయిలీ పౌరుల్ని హతమార్చడమే కాకుండా, 240 మందిని బందీలుగా పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ హమాస్‌ని నేలకూల్చే లక్ష్యంతో గాజాపై దాడులు చేస్తోంది. ఇప్పటికే ఈ హమాస్ పొలిటకల్ బ్యూరో ఛీప్ ఇస్మాయిల్ హానియేని హతమార్చడమే కాకుండా, దాని మిలిటరీ వింగ్ నాయకుడు మహ్మద్ డయిఫ్‌ని చంపేసింది. మరికొందరు కీలక కమాండర్లను హతమార్చింది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 40 వేలకు పైగా సాధారణ పాలస్తీనా ప్రజలు మరణించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com