Kenya Road Crash : కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం

అదుపు తప్పిన ట్రక్, 48 మంది మృతి.

కెన్యా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పశ్చిమ కెన్యాలో రద్దీగా ఉండే జంక్షన్‌లో ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 48 మంది మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు.




కెన్యా దేశంలో కెరిచో- నకురు పట్టణాల మధ్య హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ కెన్యాలో రద్దీగా ఉండే జంక్షన్‌లో ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 48 మంది మృతి చెందినట్లు కెన్యా దేశ పోలీసులు తెలిపారు.మరో 30 మంది తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రులకు తరలించారు. పలు మినీబస్సుల శిధిలాలు, బోల్తా పడిన ట్రక్కుతో ఆ ప్రదేశమంతా భయానకంగా మారింది.

నియంత్రణ కోల్పోయిన ట్రక్కు, 8 వాహనాలు, మోటారుసైకిళ్లు, రోడ్డు పక్కన ఉన్న షాప్ లను కూడా ఢీకొట్టింది. లోండియాని జంక్షన్ రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని కెన్యా రవాణ శాఖ మంత్రి కిప్ఛుంబా ముర్కో మెన్ ట్విట్టరులో తెలిపారు. సంఘటన స్థలానికి అంబులెన్సులు, సహాయ కార్యకర్తలు, కెన్యా రెడ్ క్రాస్ కార్యకర్తలను రప్పించారు.కెన్యాలో కురుస్తున్న భారీవర్షాలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఈ ప్రమాదంపై కెరిఖో కౌంటీ గవర్నర్ ఎరిక్ ముటాయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


ఇది కెన్యా చరిత్రలోనే అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదాల్లో ఒకటి గా చెబుతున్నారు. పెద్ద పెద్ద నగరాలకు సైతం ఇరుకు రోడ్లు ఉండటం ప్రమాదాలకు కారణమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏడాది ప్రారంభంలో, సెంట్రల్ కెన్యాలో ఒక బస్సు వంతెనపై నుండి పడి నది లోయలో పడిపోయింది. ఆ ప్రమాదంలో 34 మంది చనిపోయారు.

కెన్యా నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ సేఫ్టీ అథారిటీ గణాంకాల ప్రకారం గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 21,760 మంది వ్యక్తులు మరణించారు..

Tags

Next Story