Earthquake: | గ్రీస్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు

యూరోపియన్ దేశమైన గ్రీస్‌లో భారీ భూకంపం వచ్చింది. బుధవరాం తెల్లవారుజామున 1.51 గంటలకు గ్రీకు ద్వీపం కాసోస్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. భూ అంతర్భాగంలో 78 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ఫ్రై పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. దీని ప్రభావంతో గ్రీస్ సమీప దేశాలైన కైరో, ఇజ్రాయెల్, ఈజిప్టు, లెబనాన్, తుర్కియే, జోర్డాన్‌లో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని చెప్పింది.
గ్రీస్ ప్రధాన భూభాగంతోపాటు గ్రీక్ ద్వీపాలైన క్రెట్, కాసోస్, కార్పథోస్, డోడకేనెస్‌లో కూడా భూమి కంపించిందని తెలిపింది. దీనివల్ల జరిగిన నష్టానికి సంబంధించి వివరాలేవీ తెలియారాలేదని అధికారులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com