Philippines : ఫిలిప్పీన్స్‌లో వరుస భూకంపాలు

Philippines : ఫిలిప్పీన్స్‌లో   వరుస భూకంపాలు

దక్షిణ ఫిలిప్పీన్స్‌లోమిండానావో ద్వీపం వరుస భూకంపాలతో వణికిపోతున్నది. శనివారం 7.6 తీవ్రతతో బలమైన భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు మిండానావో ద్వీపంలోని హినాటువాన్ మున్సిపాలిటీలో మరోసారి భూమి కంపించింది. దీని తీవ్రత 6.9గా నమోదయిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 30 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. హినాటువాన్‌కు 72 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని చెప్పింది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.


కాగా, ఆదివారం సాయంత్రం కూడా 6.6 తీవ్రతతో భూమి కంపించింది. ఇక శనివారం ఇదే ప్రాంతంలో 7.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. శనివారం నాటి భూకంపం వల్ల ఇద్దరు మరణించారు. పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించామని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న పడవలు తదుపరి సలహా ఇచ్చే వరకు సముద్రంలో లోతైన నీటిలో ఉండాలి’ అని ఫివోల్స్క్ సూచించింది. అలాగే, సురిగో డెల్ సుర్, డవో ఓరియంటల్ ప్రావిన్సుల తీరంలోని ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది. గత నెలలో దక్షిణ ఫిలిప్పీన్స్‌లో వచ్చిన 6.7 తీవ్రత కల భూకంపం కారణంగా ఎనిమిది మంది చనిపోయారు.


పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఉన్న ఫిలిప్పీన్స్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. దీనిని అమెరికా జియోలాజికల్ సర్వే ప్రపంచంలో అత్యంత భూకంప, అగ్నిపర్వత క్రియాశీల జోన్ గా గుర్తించింది. ఈ ప్రాంతంలో ఇప్పుడు మరోసారి భూకంపం రావడం, సునామీ హెచ్చరికలు జారీ చేయడం కలకలం రేపుతోంది.


Tags

Read MoreRead Less
Next Story