Chicago: అమెరికాలో ఆగని కాల్పుల మోత.. ఆరుగురు మృతి..

Chicago: అమెరికాలో ఆగని కాల్పుల మోత.. ఆరుగురు మృతి..
Chicago: చికాగో శివారులో స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌ జరుగుతోంది.. ఇంతలో కాల్పుల మోత.. ఆరుగురు మరణించగా, 24 మంది గాయాల బారిన పడినట్లు అధికారులు తెలిపారు.

Chicago: చికాగో శివారులో స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌ జరుగుతోంది.. ఇంతలో కాల్పుల మోత.. ఆరుగురు మరణించగా, 24 మంది గాయాల బారిన పడినట్లు అధికారులు తెలిపారు. స్థానిక నివేదికల ప్రకారం, వేడుకలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఒక సాయుధుడు రిటైల్ దుకాణం పైకప్పు నుండి క్రింద ఉన్న కవాతులోకి కాల్పులు ప్రారంభించాడు.

అనుమానిత షూటర్, రాబర్ట్ క్రిమో (22)గా భావించి పోలీసులు అతడిని అరెస్టు చేశారు. సంపన్న సబర్బన్ నగరమైన హైలాండ్ పార్క్ వీధుల్లో కాల్పులు జరగడంతో పరేడ్‌లో పాల్గొన్నవారు భయంతో పరుగులు పెట్టారు. కాల్పుల్లో గాయపడిన వారిని హైలాండ్ పార్క్ ఆసుపత్రికి తరలించారు.

సంతోషంగా సాగాల్సిన స్వాతంత్ర్య సంబరాలు విషాదంగా మరాయి. అనుకోని ఈ సంఘటనకు దిగ్భ్రాంతికి గురైన అధికారులు ఉత్సవాలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అధ్యక్షుడు జో బిడెన్, అతని భార్య జిల్ "ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున అమెరికన్ కమ్యూనిటీకి మరోసారి దుఃఖాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాకీ కాల్పుల ద్వారా ప్రతిఏటా సుమారు 40 వేల మంది మృత్యువాత పడుతున్నట్లు అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story