Earthquake : కొలంబియన్ రాజధాని బొగోటాలో భారీ భూకంపం
కొలంబియా రాజధాని బొగోటాలో గురువారం తీవ్ర భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. అయితే భూకంప కారణంగా సైరన్‌లు మోగడంతో కొద్దిసేపు భయాందోళనలకు దారితీసింది. ఒక మహిళ భవనంపై నుండి పడి మరణించిందని స్థానిక అధికారులు ప్రకటించారు. బొగోటాకు ఆగ్నేయంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్ కాల్వరియో పట్టణంలో భూకంప కేంద్రం ఉందని కొలంబియన్ జియోలాజికల్ సర్వే తెలిపింది. కాసేపటి తర్వాత 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఏజెన్సీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భూకంపం మధ్యాహ్నం 12:04 గంటలకు (1704 GMT) సంభవించిందని కొలంబియన్ ఏజెన్సీ తెలిపింది.
అయితే భూకంపం సంభావించటం, తరువాత సైరన్‌లు మోగడంతో కొద్దిసేపు భయాందోళనలకు గురైన వేలాది మంది నివాసితులు రాజధాని వీధుల్లోకి వచ్చారు. పెద్ద భవనాలు కంపించాయి. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న విల్లావిసెన్సియో, బుకారమంగా, తుంజా, ఇబాగ్ నగరాల్లో భూకంపం సంభవించినట్లు సోషల్ మీడియాలో అక్కడి స్థానికులు పోస్ట్ చేశారు. విలావిసెన్సియోలో కొండచరియలు విరిగిపడ్డాయి.భూకంపం సంభవించగానే ప్రజలు ఇళ్లలోని వీధుల్లోకి పరుగులు తీశారు. వీధుల్లోనే భయంతో చాలాసేపు నిరీక్షించారు.
భూకంపం సంభవించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ ప్రధాని లోపెజ్ సూచించారు. సెంట్రల్ కొలంబియా భూకంపాలకు ప్రసిద్ధి. 2008లో ఎల్ కాల్వరియోలో 5.5 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 11 మంది మరణించారు. భారీ ఆస్తి నష్టం కూడా సంభావించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com