ఫిలిప్పీన్స్ లో భారి భూకంపం

ఫిలిప్పీన్స్ లో భారి భూకంపం
రిక్టర్ స్కేలుపై 6.5 గా నమోదు

ఫిలిప్పీన్స్ ను భారీ భూకంపం భయపెట్టింది. ఉత్తర ఫిలిప్పీన్స్ లోని మిండోరో ద్వీపంలో గురువారం ఉదయం భూమి కంపించింది. దేశ రాజధాని మనీలాకు 124 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృత‌మైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.5గా నమోదైనట్లు వెల్లడించింది. ఫిలిప్పీన్స్ లో ఇవాళ 6.5 తీవ్రతతో భూకంపం సంభవించిందనీ, ప్రకంపనల కార‌ణంగా నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందని స్థానిక అధికారులు హెచ్చరించారు.

మనీలాతో సహా దేశంలోని అత్యధిక జనాభా కలిగిన ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించిన తర్వాత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన‌ట్టు స్థానిక అధికారులు తెలిపారు. ప్రస్తుతం సంభ‌వించిన భూకంప ప్రభావం చాలా అధికంగానే ఉందనీ.. ప్రకంపనల సమయంలో జనం ఇళ్ల నుంచి పరుగులు తీస్తూ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆస్తి, ప్రాణ నష్టాల వివరాలు ఇంకా తెలియరాలేదు. కానీ ప్రకంపనల ప్రభావాన్ని అంచనా వేయడానికి విపత్తు అధికారులను నియమించామని అధికారులు చెబుతున్నారు.

ఈ భూకంపం 30 సెకన్ల నుంచి నిమిషం వరకు కొనసాగిందని తెలుస్తోంది. జపాన్ నుండి ఆగ్నేయాసియా-పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించిన తీవ్రమైన భూకంప-అగ్నిపర్వతాలకు అనుగుణంగా ఉండే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ వెంబడి ఉన్న ఫిలిప్పీన్స్ లో భూకంపాలు చాలా తరచుగా సంభవిస్తాయి. 2013 అక్టోబర్ లో సెంట్రల్ ఫిలిప్పీన్స్ లోని బోహోల్ ద్వీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించి కొండచరియలు విరిగిపడి 200 మందికి పైగా చనిపోయారు. అప్పుడు భూకంపం కారణంగా దాదాపు 400,000 మంది నిర్వాసితులయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story