Spain: క్రిస్మస్ పార్టీ చేసుకున్నారు.. 70 మంది వైద్య సిబ్బంది కోవిడ్ బారినపడ్డారు..

Spain (tv5news.in)

Spain (tv5news.in)

Spain: సోషల్ డిస్టెన్స్ మెయింటేయిన్ చేయకపోవడం, మాస్కులు ధరించకపోవడం కూడా కోవిడ్ వ్యాప్తికి కారణాలవుతున్నాయి.

Spain: మరోసారి కరోనా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఇబ్బంది పెడుతోంది. కొన్నిరోజులు అంతా సవ్యంగా సాగుతుంది, కరోనా ప్రభావం తగ్గిపోయింది అనుకుంటున్న సమయంలోనే మరోసారి కోవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. సోషల్ డిస్టెన్స్ మెయింటేయిన్ చేయకపోవడం, మాస్కులు ధరించకపోవడం కూడా దీని వ్యాప్తికి కారణాలవుతున్నాయి.

స్పెయిన్‌లో కొంతకాలం క్రితం వరకు కోవిడ్ కంట్రోల్‌లోనే ఉంది. కానీ ఇంతలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న 70 మంది సిబ్బందికి కరోనా సోకినట్టు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. డిసెంబర్ 1న జరిగిన క్రిస్మస్ పార్టీకి వెళ్లడం వల్లే ఇది జరిగిందని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. కానీ పార్టీకి వెళ్లే ముందు అందరు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నట్టు, వ్యాక్సిన్ వేయించుకున్నట్టు వైద్యాధికారులు అంటున్నారు.

ఒమ్రికాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న సందర్భంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తెలిపారు. ఇప్పటికే స్పెయిన్‌లోని బ్యాలరిక్ దీవుల్లో నాలుగు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమొదయ్యాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండడం అవసరమని ఆయన స్పష్టం చేశారు. అంతే కాకుండా ఇటీవల సౌత్ ఆఫ్రికా నుండి స్పెయిన్ వచ్చిన వ్యక్తికి కూడా ఒమ్రికాన్ వేరియంట్ కోవిడ్ ఉన్నట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story