Earthquake: అమెరికాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక

అమెరికాలోని అలాస్కా(Alaska) ను భారీ భూకంపం( earthquake) వణికించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2(7.2 magnitude)గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే( United States Geological Survey) తెలిపింది. విపత్తు తీవ్రత భారీగానే ఉందనీ అధికారులు తెలిపారు. చాలా ప్రాంతాలకు ముందస్తు సునామీ హెచ్చరికలు(tsunami advisory ) జారీ చేశారు. అలస్కా ద‍్వీపకల్పంతో సహా అలూటియన్ దీవులు, కుక్ ఇన్‌లెట్ ప్రాంతాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం ఇప్పుడే అంచనా వేయలేమని వెల్లడించారు.
అలాస్కాలో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అలాస్కా ద్వీపకల్పానికి 21 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం గుర్తించినట్లు అమెరికా తెలిపింది. అలస్కాలో చివరిసారిగా అత్యధికంగా 1964లో 9.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. అలస్కా ద్వీపకల్పం, యూఎస్ పశ్చిమ తీరం, హవాలీని సునామీ అతలాకుతలం చేసింది. 250 మందికి పైగా ప్రాణనష్టం జరిగింది. అలస్కా ప్రాంతం తరచూ భూకంపాలకు నిలయంగా మారుతోంది.
షిషల్డిన్( Shishaldin volcano) అగ్నిపర్వతం బద్ధలయ్యే అవకాశాలున్నట్లు అలాస్కా వల్కనో అబ్జర్వేటరీ హెచ్చరించింది. అగ్నిపర్వతం నుంచి భారీగా బూడిద వెదజల్లినట్లు పేర్కొంది. భూకంప ధాటికి అలస్కాన్ ద్వీపకల్పంతోపాటు అలూటియన్ దీవులు, కుక్ ఇన్లెట్ ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com