ఈ నిజాన్ని ప్రపంచానికి చెప్పకపోతే నన్ను నేను క్షమించుకోలేను: చైనా వైరాలజిస్ట్

ఈ నిజాన్ని ప్రపంచానికి చెప్పకపోతే నన్ను నేను క్షమించుకోలేను: చైనా వైరాలజిస్ట్
హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో వైరాలజీ మరియు ఇమ్యునాలజీలో నైపుణ్యం కలిగిన డాక్టర్ లి-మెంగ్.

అగ్రరాజ్యం అమెరికా ముందునుంచి మొత్తుకుంటూనే ఉంది.. చైనాలోని ఊహాన్ నుంచే ఈ కరోనా వైరస్ వచ్చింది అని.. వాళ్లకి ముందే తెలిసినా ప్రపంచాన్ని అప్రమత్తం చేయకుండా చోద్యం చూస్తూ నిలబడ్డారని.. ఇప్పుడు అదే నిజమైంది.. చైనా వైరాలజిస్ట్ డాక్టర్ లి-మెంగ్ యాన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.. హాంకాంగ్‌లో పనిచేస్తున్న అగ్రశ్రేణి శాస్త్రవేత్తలలో ఆమె ఒకరు. ఊహాన్ ల్యాబ్ లో కరోనా వైరస్ తయారైందని యాన్ అన్నారు. ఇందుకు సంబంధించిన రుజువులు కూడా తనదగ్గర ఉన్నాయని ఆమె తెలిపారు. కరోనా వైరస్ గురించి చైనా ప్రభుత్వానికి ముందే తెలుసునని అన్నారు. హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో వైరాలజీ మరియు ఇమ్యునాలజీలో నైపుణ్యం కలిగిన డాక్టర్ లి-మెంగ్, భద్రతా సమస్యల కారణంగా అమెరికాకు పారిపోవాల్సి వచ్చింది.

సెప్టెంబర్ 11 న, ఆమె ఒక రహస్య ప్రదేశం నుండి బ్రిటిష్ టాక్ షో "లూస్ ఉమెన్" లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కరోనావైరస్ వ్యాధిపై ఆమె చేసిన పరిశోధనల గురించి మరియు ఆమె ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి మాట్లాడారు. డాక్టర్ లి-మెంగ్ చైనాలో "కొత్త న్యుమోనియా" పై డిసెంబర్, జనవరి నెలల్లో పరిశోధనలు నిర్వహించామని, ఫలితాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కన్సల్టెంట్‌గా ఉన్న పర్యవేక్షకుడితో పంచుకున్నానని చెప్పారు. ఆ పర్యవేక్షకుడు "చైనా ప్రభుత్వానికి, డబ్ల్యూహెచ్‌ఓకు వారధిగా పనిచేస్తారని ఊహించింది. కానీ ఆమె అంచనాలను తలక్రిందులు చేస్తూ.. దీనిపై మీరేమీ మాట్లాడొద్దు.. ఒకవేళ కాదని మాట్లాడితే కనిపించకుండా పోతారు అని అన్నారు..

చైనీయులు ఫిబ్రవరి 12న జరుపుకునే న్యూ ఇయర్ వేడుకల సమయంలో, చైనా నుండి ప్రపంచానికి పెద్ద ఎత్తున రాకపోకలు జరుగుతాయి. ఆ సమయంలో వైరస్ బాగా విస్తరించింది. అంతకు ముందే వైరస్ గురించి నేను పడిన ఆందోళన నిజమైంది.. ఈ రోజు ప్రపంచమంతా ఈ వైరస్ ని ఎదుర్కోలేక ఇబ్బంది పడుతున్నారని వాపోతోంది. "నేను ప్రపంచానికి నిజం చెప్పకపోతే నన్ను నేను క్షమించుకోలేను అని ఆమె అన్నారు. జనవరి 17 న, యుఎస్ లోని ఒక ప్రసిద్ధ చైనీస్ యూట్యూబర్‌ను సంప్రదించినట్లు ఆమె తెలిపింది. ఈ వైరస్ ప్రకృతి నుండి వచ్చినది కాదు. ఇది చైనా మిలిటరీ ఇన్స్టిట్యూట్ లోనే కనుగొనబడిందని చెప్పారు. వైరస్ మాంసాహార మార్కెట్ల నుంచి ఉద్భవించిందని సూచించిన నివేదికలను డాక్టర్ లి-మెంగ్ తోసిపుచ్చారు. వైరస్ యొక్క మూలాలు తెలుసుకోవడం మాకు క్లిష్టమైన విషయం. కాకపోతే, ఇది ప్రతి ఒక్కరికీ ప్రాణహాని కలిగిస్తుందని ఆమె తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story