Qatar modi : మోదీ దెబ్బకు దిగొచ్చిన ఖతార్ ప్రభుత్వం

Qatar modi : మోదీ దెబ్బకు దిగొచ్చిన ఖతార్ ప్రభుత్వం
స్వయంగా కేసు పర్యవేక్షించిన ప్రధాని

భారత్-ఖతార్‌ మధ్య దౌత్యం విజయం సాధించింది. గతేడాది మరణశిక్షకు గురైన ఎనిమిది మంది భారత నౌకాదళ అధికారులను ఖతార్‌ సోమవారం విడుదల చేసింది. ఖతార్‎లో బందీలైన నావికాదళ అధికారులను విడిపించాలని నౌకాదళ కుటుంబసభ్యులు విదేశీ మంత్రిత్వ శాఖను కోరారు. వీరి అభ్యర్థనపై ఖతార్ తో సంప్రదింపులు జరిపింది భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ. తమ దేశం నుంచి బందీలైన వారిని విడిచిపెట్టి, సురక్షితంగా స్వదేశానికి తిరిగి పంపించాలని కోరింది. ఇక ఏం చేయలేమని ఆశలు అన్నీ వదులుకున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో వారు మరణ శిక్ష నుంచి తప్పించుకోవడమే కాకుండా భారత్‌కు కూడా చేరుకోవడం ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులతోపాటు దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ 8 మంది భారత నేవీ మాజీ అధికారులు.. కేసు నుంచి బయటపడి.. స్వదేశానికి చేరుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర కృషి చేశారని కేంద్ర విదేశాంగ శాఖ సెక్రటరీ వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు.


ఇదిలా ఉంటే నౌకాదళ సిబ్బందిని స్వదేశానికి తీసుకురావడానికి చట్టపరమైన సహాయం ఏర్పాటు చేస్తామని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చింది భారత్. ఎనిమిది మంది మాజీ నేవీ ఆఫీసర్లలో, ఏడుగురు ఇప్పటికే భారతదేశానికి తిరిగి వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) సోమవారం అధికారిక ప్రకటన ద్వారా తెలియజేసింది. బందీగా ఉన్న భారతీయులను విడుదల చేసి స్వదేశానికి పంపించడానికి వీలుగా ఖతార్ రాష్ట్ర అమీర్ తీసుకున్న నిర్ణయాన్ని, ఏర్పాట్లను తాము అభినందిస్తున్నామని తెలిపింది భారత విదేశాంగశాఖ. ఈ నేపథ్యంలోనే బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఖతార్‌లో పర్యటించనున్నట్లు వినయ్ మోహన్ క్వాత్రా తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనున్నట్లు వివరించారు. యూఏఈ పర్యటన ముగిసిన తర్వాత మోదీ బుధవారం ఖతార్‌లోని దోహాకు వెళ్లనున్నట్లు చెప్పారు. అయితే 8 మంది భారత మాజీ నేవీ అధికారులు.. భారత్ చేరుకున్న రోజే ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షించినట్లు వినయ్ మోహన్ క్వాత్రా తెలిపారు.

Tags

Next Story