Thailand-Cambodia : థాయ్-కంబోడియా మధ్య సైనిక ఘర్షణ..

థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఎనిమిది మంది మరణించగా.. డజన్ల కొద్దీ గాయపడ్డారు. గత రెండు రోజుల్లో థాయ్ సైనిక కాల్పుల్లో ఏడుగురు కంబోడియా పౌరులు మరణించారని, 20 మంది గాయపడ్డారని కంబోడియా జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు తమ వైపు నుంచి ఓ సైనికుడు మరణించాడని, 18 మంది గాయపడినట్లు థాయ్ సైన్యం ధృవీకరించింది. తాజా ఘర్షణలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలూ సంయమనం పాటించాలని సూచించారు. కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
కాగా, ఈ ఏడాది జులైలో థాయ్‌లాండ్, కంబోడియా మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సరిహద్దుల పొడవున అనేక ప్రాంతాల్లో ఇరుదేశాలకు చెందిన సైనికుల మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలలో సైనికులతోపాటూ పౌరులు కూడా మరణించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో ట్రంప్ రంగంలోకి దిగారు. కౌలాలంపుర్‌లో ఇరు దేశాల మధ్య సంధి కుదిర్చారు. ట్రంప్ సమక్షంలో థాయ్‌లాండ్-కంబోడియా దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీంతో సరిహద్దుల్లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయితే, ఐదు నెలల్లోనే మళ్లీ అక్కడ ఘర్షణలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

