Ukrain war: మరోదాడికి పాల్పడిన రష్యా

ఉక్రెయిన్ పై రష్యా సాగింస్తున్న దాడుల్లో 8 మంది పౌరులు మృతి చెందగా పలువురు గాయాలపాలయ్యారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం గత రెండు నెలలుగా కొనసాగుతూనే ఉంది. డొనెట్‌స్క్‌లోని నియు–యోర్క్‌పై రష్యా సైన్యం జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కొస్టియాంటీనివ్కాపై జరిగిన రాకెట్ల దాడిలో 20 వరకు ఇళ్లు, కార్లు, గ్యాస్ పైప్‌లైన్ ధ్వంసం కాగా ఇద్దరు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు బఖ్‌మట్ నగరం లో నియుయోర్క్ నివాస ప్రాంతాలపై శుక్రవారం రాత్రి రష్యా దాడులకు కొత్తగా పెళ్లయిన దంపతులతో సహా మొత్తం నలుగురు మృతి చెందారని తూర్పు డొనెట్స్ రీజియన్ ప్రాసిక్యూటర్ ఆఫీస్ వెల్లడించింది. .మరోవైపు రష్యా క్రూయిజ్ మిస్సైళ్లు పడటంతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జపొరిఝియా అణు ప్లాంట్ పొరుగునే ఉన్న పట్టణంపై రష్యా దాడిలో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. ఇలా ఉండగా, నల్ల సముద్రం ధాన్యం రవాణా ఒప్పందాన్ని రద్దు చేసిన రష్యా ఉక్రెయిన్ నౌకా తీర ప్రాంతం ఒడెసాను లక్ష్యంగా చేసుకుంది. రష్యా మిలటరీ ప్రయోగించిన రెండు క్రూయిజ్ మిస్సైళ్లు గిడ్డంగులపై పడటంతో మంటలు చెలరేగి పరికరాలు ధ్వంసమయ్యాయని, 120 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు బూడిదయ్యాయని ఉక్రెయిన్ తెలిపింది. క్రిమియాపై దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులకు పాల్పడినట్లు రష్యా తెలిపింది. ఈ న్యూక్లియర్ ప్లాంటును ఉపయోగించుకుని సమీపాన ఉన్న ఉక్రెయిన్ భూభాగంపై తరచుగా రష్యా దాడులకు పాల్పడుతోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. అయితే 14 రష్యా డ్రోన్లను తాము కూల్చి వేశామని ఉక్రెయిన్ వైమానిక దళం శనివారం ప్రకటించింది. ఇందులో ఐదు ఇరాన్ తయారీ డ్రోన్లు ఉన్నాయని పేర్కొంది.
యుద్ధ పరిణామంపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్లను పశ్చిమదేశాలు నెరవేర్చి, ధాన్యం రవాణా కారిడార్ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలని సూచించారు. వచ్చే నెలలో తుర్కియేలో పుతిన్తో భేటీ ఉంటుందని ఆశిస్తున్నానన్నారు. కాగా, రష్యా ఆక్రమిత క్రిమియాలో వారం వ్యవధిలో రెండోసారి డ్రోన్ పేలింది. క్రాస్నోవార్డిస్క్‌లోని ఆయిల్ డిపో, ఆయుధ గిడ్డంగిలను డ్రోన్ బాంబులతో పేల్చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. గత ఉక్రెయిన్ జరిపిన దాడిలో రష్యాను కలిపే కీలకమైన క్రిమియా వంతెన కొంతభాగం దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇలా ఉండగా, జపొరిఝియా ప్రాంతంలో ఉక్రెయిన్ శతఘ్ని కాల్పుల్లో రియా వార్తా సంస్థకు చెందిన రష్యా జర్నలిస్టు ఒకరు మృతి చెందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com