US: అమెరికాలో భారీ వర్షాలు.. 9 మంది మృతి

అగ్ర రాజ్యం అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ తుఫాన్లు కారణంగా వరదలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. భారీగా గాలులు వీచడంతో ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో అత్యధికంగా కెంటుకీలో ప్రాణనష్టం జరిగింది. వరదలు కారణంగా ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు. కార్లు నీటిలో చిక్కుకుని మునిగిపోవడంతో ప్రాణాలు పోయాయి. అంతేకాకుండా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 39,000 ఇళ్లల్లో విద్యుత్ నిలిచిపోయింది. దీంతో అంధకారం అలుముకుంది. పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని కెంటుకీ గవర్నర్ తెలిపారు.
అమెరికాలో భారీ తుఫాన్లు కారణంగా వరదలు ముంచెత్తాయి. వర్షాల కారణంగా కెంటుకీలో ప్రాణనష్టం జరిగింది. కెంటుకీలో గడిచిన 48 గంటల్లో రికార్డ్ స్థాయిలో వర్షం కురిసింది. వరదలు కారణంగా ఇప్పటి వరకు తొమ్మిది మంది చనిపోయారని అధికారులు తెలిపారు. కార్లు నీటిలో చిక్కుకుని మునిగిపోవడంతో వీరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్టు సమాచారం. వరదలు కారణంగా ప్రాణనష్టం జరగడం విషాదకరమని కెంటుకీ గవర్నర్ ఆండీ బెషీర్ తెలిపారు. ఇక వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించాల్సి ఉందన్నారు. ఇక సహాయక చర్యలను సమన్వయం చేయడానికి ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీకి అధికారం ఇచ్చారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వరదలపై సమీక్షిస్తున్నారు. కెంటుకీ, టేనస్సీలోని కొన్ని ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షం కురిసిందని నేషనల్ వెదర్ సర్వీస్ సీనియర్ ఫోర్కాస్టర్ బాబ్ ఒరావెక్ తెలిపారు. భారీ వరదలు కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com