Turkey Earthquake: 94 గంటలు శిథిలాల కింద.. తన మూత్రం తానే తాగి..

Turkey Earthquake: మునుపెన్నడూ కనీ వినీ ఎరుగని విపత్తు.. సిరియా, టర్కీ భూకంపం.. శిధిలాల కింద చిక్కుకున్న బాధితుల ఆర్తనాదాలు.. తమ వాళ్లు ఎక్కడున్నారో, అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియని పరిస్థితి. ఒక్కో రోజు ఒక్కో హృదవిదారక దృశ్యం వెలుగు చూస్తోంది. టర్కీలోని గజియాంటెప్ నగరంలో శిథిలాల కింద చిక్కుకున్న 17 ఏళ్ల యువకుడిని దాదాపు నాలుగు రోజుల తర్వాత రెస్క్యూ టీమ్ రక్షించింది.
అతను "తన మూత్రాన్ని తానే తాగి తనను తాను రక్షించుకున్నానని యువకుడు తెలిపాడు.అద్నాన్ ముహమ్మత్ కోర్కుట్ టర్కీలోని గజియాంటెప్ నగరంలో కనీసం 94 గంటలపాటు శిథిలాల కింద చిక్కుకుపోయాడు. భూకంపం సంభవించినప్పుడు అతను తన ఇంటిలో నిద్రిస్తున్నాడు.
భూమి కంపించి తాను శిధిలాల కింద కూరుకుపోయానని తెలిపాడు. ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతుకులాట కొనసాగుతున్న సమయంలో రెస్క్యూ టీమ్ గొంతు తనకు వినిపించినా తన మాట వారికి వినిపించలేదు.. దాంతో నాకు ఆందోళన ఎక్కువైంది. అయితే నాలుగు రోజుల తర్వాత ఎట్టకేలకు అద్నాన్ విముక్తి పొందాడు.
7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం టర్కీ మరియు సిరియాలో 24,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విపత్తు సంభవించి 100 గంటలకు పైగానే అయినా ఇంకా బాధితులు, యువకులు, వృద్ధులు రక్షించబడుతూనే ఉన్నారు. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వారిపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com