Brazil: బ్రెజిల్‌లో భీముడు పుట్టాడు..

Brazil: బ్రెజిల్‌లో భీముడు పుట్టాడు..
Brazil: మూడు కిలోల బరువుంటేనే ముచ్చెమటలు పడుతుంటాయి అమ్మకు... డెలివరీ ఎప్పుడు అవుతామో అని ఆపసోపాలు పడుతుంటారు

Brazil: మూడు కిలోల బరువుంటేనే ముచ్చెమటలు పడుతుంటాయి అమ్మకు... డెలివరీ ఎప్పుడు అవుతామో అని ఆపసోపాలు పడుతుంటారు పొట్టలోని బిడ్డ బరువు మోయలేక.. మరి డబుల్ కంటే ఎక్కువ వున్న ఈ బుజ్జిగాడిని ఆ తల్లి ఎలా మోసింది. ఎన్ని ఇబ్బందులు పడిందో పాపం. పుట్టినప్పుడు ఆ చిన్నారి బరువు 7 కిలోల 328 గ్రాములు ఉన్నాడు. అందుకే అమెజాన్‌లో అతిపెద్ద శిశువుగా పరిగణించబడ్డాడు.

27 ఏళ్ల యువ తల్లి, క్లీడియాన్ శాంటోస్ డోస్ శాంటోస్, తన బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆస్పత్రికి వచ్చారు. అదృష్టవశాత్తూ పొట్టలోని బిడ్డ ఓవర్ వెయిట్ ఉన్నా తల్లి ఎటువంటి సమస్య లేకుండా వైద్య ప్రక్రియ ముగిసింది. అధిక బరువుతో జన్మించిన శిశువు ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

క్లీడియాన్ శాంటోస్ డోస్ శాంటోస్ పరింటిన్స్ నివాసి. పిల్లవాడి సైజు తనను ఆశ్చర్యపరిచిందని, అయితే ఆరోగ్యంగా ఉన్న తన బిడ్డను చూసిన తరువాత అనుభూతి వర్ణించలేనిదని ఆమె చెప్పింది. నార్మల్ డెలివరీకి సహకరించిన ఆసుపత్రి సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

''బిడ్డ ఇంత బరువు ఉంటాడని అసలు ఊహించలేదు, నాలుగు కేజీలు ఉండొచ్చని అనుకున్నా.. కానీ ఏడు కేజీలు ఉన్నాడు. నేను డెలివరీకి ఆస్పత్రికి వచ్చిన దగ్గర నుంచి నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఇక్కడి వైద్య సిబ్బంది. వారు లేకుంటే, నా పరిస్థితి ఎలా ఉండేదో నేను ఊహించలేకపోతున్నాను. నాకు ధైర్యాన్ని అందించి, చికిత్స చేసిన పాడే కొలంబో ఆసుపత్రి బృందానికి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అని చిన్నారి తల్లి తెలిపారు.

Tags

Next Story