Japan : నైట్ షిఫ్ట్ లు ఆపేస్తే..జనాభా పెరిగింది

జపాన్లో జనాలు తగ్గిపోతున్నారట. పుట్టిన వారి కంటే మరణించిన వారి ఎక్కువగా ఉందట. ఈ నేపథ్యంలో ఓ కంపెనీ వినూత్న నిర్ణయం తీసుకుంది. తమ ఉత్పాదకత పెంచేందుకు ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయం వాళ్ళ ప్రొడక్టివిటీని పెంచడమే కాదు బర్త్‌రేట్ పైనా ప్రభావం చూపింది.
జపాన్‌లో సగటు సంతాన రేటు 1.3.. అయితే దీనిని ఇటోచు కంపెనీ ఉద్యోగినులు అధిగమించారు. ఇటీవల ఉద్యోగులకు వారానికి రెండు రోజులు ఇంటినుంచి పనిచేసేందుకు అనుమతించడంతో పాటు కార్యాలయ పని గంటలను ఎనిమిది నుంచి ఆరు గంటలకు కుదించింది. 2010లో జపాన్ ట్రేడింగ్ కంపెనీ ఇటోచుకు క సీఈవోగా మషిహిరో ఒకఫుజి నియమించబడ్డారు. అప్పటి నుంచి ఉత్పాదకత పెంచడంతో పాటు జపాన్‌లో తమ ప్రత్యర్ధులకు దీటైన పోటీ ఇచ్చే ఉద్దేశంతో మొత్తం ప్లాన్ లు మార్చారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత పనివేళలను నిషేధించారు. దీనితో పదేండ్ల అనంతరం కంపెనీలో మహిళా ఉద్యోగుల సంతాన సాఫల్య రేటు రెండింతలైంది. కంపెనీలో పనిచేసే మహిళా ఉద్యోగులకు 2022 నాటికి ఇద్దరు పిల్లల చొప్పున ఫెర్టిలిటీ రేటు పెరిగిందని గుర్తించారు.
అంతే కాదు అనుకోని పరిస్థితులు మినహా నైట్ ఓవర్‌టైమ్‌ను కూడా రద్దు చేశారు. సాధారణంగా ఇలాంటి మార్పులు చేసి, పని గంటలు తగ్గిస్తే ప్రోడక్టీవిటీ పడిపోతుంది అని అందరూ అనుకుంటారు కానీ ఇన్ని మార్పులు చేసినా ఈ పదేండ్లలో ఫ్యామిలీమార్ట్ నుంచి మెటల్స్ ట్రేడింగ్ వరకూ ఇటోచు లాభాలు ఏకంగా ఐదింతలు పెరిగాయి. 2010 నుంచి 2021 వరకూ ఇబ్బడిముబ్బడిగా కంపెనీ లాభాలను ఆర్జించింది. ఈ క్రమంలో పలువురు మహిళా ఉద్యోగులు మెటర్నిటీ లీవులు తీసుకుని పిల్లలను కని తిరిగి పనిచేసేందుకు వచ్చారు. తాము ఉత్పాదకత పెంచేందుకు తీసుకున్న ఈ నిర్ణయం బర్త్ రేట్‌పై ప్రభావం చూపుతుందని తామనుకోలేదని ఇటోచు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫుమిహికో కొబయషి చెప్పుకొచ్చారు.. అంతేకాదు ఇది ఆనందంగా ఉందని కూడా చెబుతున్నారు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com