అమ్మాయిల వాట్సాప్ గ్రూపులో అబ్బాయి.. అతడేం ఏం చేశాడంటే?

అప్పుడప్పుడు మన ప్రమేయం లేకుండానే మనకి సంబంధం లేని వాట్సాప్ గ్రూపులలో యాడ్ చేయబడుతాం.. ఆలాంటి సమయంలో వెంటనే ఆ గ్రూపులోనుంచి ఎగ్జిట్ అయిపోతాం.. లేదంటే ఆ గ్రూప్ ను మ్యూట్ లో పెట్టేస్తాం.. అయితే ఓ అమ్మాయిల బ్యాచిలర్ పార్టీ గ్రూపులో ఓ అబ్బాయి యాడ్ చేయబడితే? అవును.. నిజంగానే ఓ అబ్బాయి తన ప్రమేయం లేకుండానే .. ఉమెన్స్ బ్యాచిలర్ పార్టీ గ్రూపులో యాడ్ చేయబడ్డాడు. ఆ తరవాత అతను పెద్ద సెలబ్రేటి అయిపోయాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టేలర్ లోవరీ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం పొరపాటున ఉమెన్స్ బ్యాచిలర్ పార్టీ గ్రూపులో యాడ్ చేయబడ్డాడు. అయితే ఆ గ్రూప్ లో కొంతమంది ఓ అమ్మాయి పెళ్లికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అయితే వాళ్లు ఎవరో.. అసలు తనను ఎందుకు గ్రూపులో యాడ్ చేశారో తెలియకపోవడంతో ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వాలని అనుకున్నాడు టేలర్ . అయితే ఎగ్జిట్ అయ్యేముందు తానెవరో ఆ గ్రూపు వారికి తెలియజేయాలని అనుకున్నాడు. దీనికోసం ఓ వీడియోని చేసి ఆ గ్రూప్ లో పోస్ట్ చేశాడు.
" హాయ్ లేడీస్.. నా పేరు టేలర్ లోవెరీ. నన్ను కెల్లర్ బ్యాచిలర్ పార్టీకి పిలిచినందుకు సంతోషం.. అయితే నేను లేడీస్ నైట్ పార్టీలో పాల్గొనటానికి విగ్ కొనుక్కోలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నాను. అయితే మీరనుకుంటునట్టుగా టేలర్(అమ్మాయి)ని కాదు. కాబట్టి మీరామెకు ఫోన్ చేసి సరైన అడ్రస్ కనుక్కోవటం మంచిది. ఎందుకంటే ఆమెకు పార్టీ గురించి ఇంకా తెలియదు. బ్యాచిలర్ పార్టీ బాగా జరగాలని కోరుకుంటున్నాను" అని ఆ వీడియోలో పేర్కొన్నాడు.
అయితే ఈ వీడియోని సదరు గ్రూపులోని ఓ అమ్మాయి తన టిక్‌టాక్ ద్వారా షేర్ చేయడంతో ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com