అంతర్జాతీయం

UK: ఇలాంటి కారణాలతో కూడా ఉద్యోగాలు ఇవ్వరా?

UK: ఎన్నోసార్లు ఒక్క పోస్ట్ కోసం ఎంతోమంది పోటీపడుతుంటారు.

ప్రతీకాత్మక చిత్రం
X

ప్రతీకాత్మక చిత్రం

UK: అసలు ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది..? ఇంటర్వ్యూ పానెల్‌లో ఆ కంపెనీకి చెందిన హై అథోరిటీ ఉద్యోగులతో పాటు హెచ్‌ఆర్ కూర్చొని ఉద్యోగం కోసం వచ్చిన వారిపై ప్రశ్నలను సంధిస్తారు. వీరు అడిగే ప్రశ్నలకు వారు సరైన సమాధానం ఇచ్చారా లేదా అని చూసుకోవడంతో పాటు వారి యాటిట్యూడ్ ఎలా ఉంది. మాట్లాడే విధానం ఎలా ఉంది అని గమనిస్తారు. ఇవన్నీ గమనించిన తర్వాత ఆ కంపెనీకి వారు సరిపోతారు అనిపిస్తే వారికి ఉద్యోగం ఇస్తారు.

ఎన్నోసార్లు ఒక్క పోస్ట్ కోసం ఎంతోమంది పోటీపడుతుంటారు. కానీ ఆ పోస్ట్‌కు ఎవరు సరైన వాళ్లు అని కంపెనీ అనుకుంటుందో వారికే ఆ అవకాశాన్ని అందిస్తారు. మిగతా వారిని సెలక్ట్ చేయకపోవడానికి కూడా కంపెనీ వద్ద పలు కారణాలు ఉంటాయి. కానీ యూకేలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్లిన ఓ యువతిని ఓ వింత కారణం చెప్పి రిజెక్ట్ చేసింది యాజమాన్యం.

సాధారణంగా ఒక ఉద్యోగానికి అప్లై చేసిన వారందరూ.. ఆ ఉద్యోగం తమకే రావాలని ఎంతో కష్టపడతారు. వారి చేతిలో ఉన్నంత వరకు వంద శాతం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కానీ ఓ సిల్లీ కారణం చెప్పి వారిని రిజెక్ట్ చేస్తే వారి కెరీర్ ఏమైపోతుంది. యూకేలో ఇంటర్వ్యూకి వెళ్లిన ఓ యువతిని లావుగా ఉందంటూ రిజెక్ట్ చేసింది కంపెనీ యాజమాన్యం. ఈ విషయాన్ని మరో మహిళ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ పోస్ట్‌ను చూసిన వారందరూ స్కిల్స్ లేకపోతే రిజెక్ట్ చేయవచ్చు కానీ లావుగా ఉందని రిజెక్ట్ చేయడమేంటి అని ఆశ్చర్యపోతున్నారు. లావు, సన్నం, నలుపు, తెలుపు అనే అంశాలను లెక్కచేస్తే టాలెంట్ ఉన్న వారు ఉద్యోగాలు లేక వెనకబడిపోతారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

RELATED STORIES