విషాదాన్ని మిగిల్చిన పుట్టినరోజు.. ఆంధ్ర మహిళ, కూతురు అమెరికాలో మరణం

అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌లో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఎన్నారై మహిళ, ఆమె కుమార్తె మృతి చెందారు. 32 ఏళ్ల మహిళ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఆలయానికి వెళుతోంది.
ఆమె కారు కాన్బీకి చెందిన 18 ఏళ్ల బెంజమిన్ హెర్నాండెజ్ నడుపుతున్న హైవే 211లో పశ్చిమ దిశగా వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. దీంతో గీతాంజలి కుమార్తె హనిక (5) అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన గీతాంజలిని హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె కూడా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆమె భర్త నరేష్, కుమారుడు బ్రమన్ కూడా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బ్రమన్ కాలు విరగడంతో వైద్యులు ఆపరేషన్ చేస్తున్నారు.
కమతం గీతాంజలి స్వస్థలం కృష్ణా జిల్లా కొనకంచి. ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందినట్లు ఆమె బంధువులు తెలిపారు.
గీతాంజలి సౌత్ మెరిడియన్ రోడ్‌లో సౌత్‌బౌండ్‌గా డ్రైవింగ్ చేస్తోందని, స్టాప్ సైన్ వద్ద ఆపడంలో విఫలమైందని పోలీసులు తెలిపారు.
గీతాంజలి, ఆమె భర్త సుమారు 10 సంవత్సరాలుగా USలో ఉంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com