10,000 కిలోల బంగారంతో తయారు చేసిన నౌక.. విలాసవంతమైన సౌకర్యాలు

10,000 కిలోల బంగారంతో తయారు చేసిన నౌక.. విలాసవంతమైన సౌకర్యాలు
X
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నౌక ఇది. దీని పేరు హిస్టరీ సుప్రీం.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నౌక ఇది. దీని పేరు హిస్టరీ సుప్రీం. దీనిని 10,000 కిలోల బంగారంతో తయారు చేశారు. దీనిని మలేషియాకు చెందిన ధనవంతుడు, రాబర్ట్ నాక్ కొనుగోలు చేసాడు.100 అడుగుల హిస్టరీ సుప్రీం అత్యంత సంపన్నమైనది. ఇది బంగారంతో పూతపూయబడి ఉంటుంది. బ్రిటీష్ లగ్జరీ గాడ్జెట్ గురువు స్టువర్ట్ హ్యూస్ ఐప్యాడ్ ఆల్కెమిస్ట్‌గా తన పని నుండి సెలవు తీసుకుని $4.8 బిలియన్ల ( 10వేల కోట్లు) విలువైన ఈ నౌకను నిర్మించారు, ఇది పూర్తిగా ప్లాటినం మరియు బంగారంతో తయారు చేయబడింది.

దీనిని పూర్తి చేయడానికి మూడు సంవత్సరాలు పట్టిందని నౌక తయారీదారు తెలిపారు. పట్టాలు, యాంకర్, డైనింగ్ ఏరియా మరియు బోట్ బేస్ సహా ప్రతిదీ బంగారం మరియు ప్లాటినంతో తయారు చేశారు.అత్యంత ఖరీదైన ఈ లగ్జరీ నౌకలో సౌకర్యాలు కూడా అంతే విలాసవంతంగా ఉంటాయి. మాస్టర్ బెడ్‌రూమ్, ప్రత్యేకమైన 18.5-క్యారెట్ డైమండ్-పొదిగిన మద్యం సీసా మరియు 68 కిలోల 24-క్యారెట్ బంగారు ఆక్వావిస్టా పనోరమిక్ వాల్ అక్వేరియం మాస్టర్ సూట్‌కు కేంద్ర బిందువులు.

ఇంత ఖరీదైన ఓడలో ప్రయాణించడం కంటే దీనిని మ్యూజియంగా చేస్తే అందరికీ సందర్శించే అవకాశం ఉంటుందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. హిస్టరీ సుప్రీమ్ ఇప్పటివరకు విక్రయించిన అత్యంత ఖరీదైన నౌక. దీని ఇంజనీరింగ్ డిజైన్ అద్భుతంగా రూపొందించారు.

లక్షల కొద్దీ రత్నాలు, మొజాయిక్‌లతో రూపొందించిన స్విమ్మింగ్ పూల్ ఈ నౌకలో ఉంది. 18.5 మిలియన్ డాలర్ల విలువైన లూయిస్ XIII కాగ్నాక్ బాటిల్స్ ఉన్న లిక్కర్ క్యాబిన్, రెండు జలాంతర్గాములకు వసతి కల్పించగల జలాంతర్గామి గ్యారేజ్ కూడా దీనిలో ఏర్పాటు చేశారు. 2011లో తయారు చేసిన ఈ నౌక ప్రశంసలతో పాటు విమర్శలను కూడా అందుకుంటోంది. డబ్బులు ఎక్కువుంటే ఇలాంటి పన్లే చేస్తారని విమర్శించేవారూ లేకపోలేదు. ఇంతకీ ఈ నౌకను కొనుగోలు చేసిన మలేషియన్ వ్యాపారవేత్త ఎవరనేది కూడా బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచారు.

Tags

Next Story