NRI: అమెరికాలో ఘోర ప్రమాదం.. తానా బోర్డు డైరెక్టర్ భార్య, ఇద్దరు కూతుర్లు మృతి

NRI: అమెరికాలో ఘోర ప్రమాదం.. తానా బోర్డు డైరెక్టర్ భార్య, ఇద్దరు కూతుర్లు మృతి
NRI: అమెరికాలోని వాలర్ కౌంటీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తానా ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ తన భార్య, ఇద్దరు కుమార్తెలను కోల్పోయారు.

NRI: అమెరికాలోని వాలర్ కౌంటీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తానా ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ తన భార్య, ఇద్దరు కుమార్తెలను కోల్పోయారు. కృష్ణా జిల్లా కురుమద్దాలికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ , గుంటూరు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివి, ఉన్నత విద్య కోసం 1995లో అమెరికా వెళ్లి పీడియాట్రిక్ కార్డియోవాస్కులర్ అనస్థీషియాలజిస్ట్‌గా పనిచేస్తూ హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు.

డాక్టర్ శ్రీనివాస్ పీడియాట్రిక్ కార్డియోవాస్కులర్ అనస్థీషియాలజిస్ట్‌గా ప్రాక్టీస్ చేస్తుండగా, అతని భార్య వాణి టెక్సాస్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మెడిసిన్ చదువుతుండగా, రెండవ కుమార్తె 11వ తరగతి చదువుతున్నారు. వాణి తన ఇద్దరు కుమార్తెలను కాలేజీ నుంచి ఇంటికి తీసుకువెళుతున్నారు. మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. టెక్సాస్‌లోని వాలర్ కౌంటీలో వారు ప్రయాణిస్తున్న కారును వ్యాన్ ఢీకొట్టింది. వాణి, ఇద్దరు కుమార్తెలు అక్కడికక్కడే మృతి చెందారు.

డాక్టర్ శ్రీనివాస్ 2017 నుంచి తానా బోర్డు మెంబర్‌గా పనిచేస్తున్నారు. శ్రీనివాస్ తన భార్య, ఇద్దరు పిల్లలు లేరన్న వార్త తెలియగానే షాక్ కు గురయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story