Canada :లైక్ కొట్టాడు ఫైన్ కట్టాడు

Canada :లైక్ కొట్టాడు ఫైన్ కట్టాడు
ఎమోజితో రిప్లై ఇచ్చి అడ్డంగా బుక్ అయిపోయిన రైతు

ఎమోషన్స్ అన్ని ఎమోజిల రూపంలో చెప్పడం అలవాటైపోయింది మనకు..కానీ అవే ఒక్కోసారి మనని ముంచేస్తాయి అని. మీకు తెలుసా. అలా అనుకోకుండా ఒక ఎమోజి వాడి కనెడా లా లో ఓ రైతు నానా కష్టాలు పట్టాడు.

ప్రస్తుత సోషల్ మీడియా లో ఎమోజిలు ఒక భాగం అయిపోయాయి. మన భావాలను వ్యక్తం చేయడానికి టెక్స్ట్ కు బదులు ఎమోజీ లను వాడుతూ ఉంటాము. అయితే చాలా వరకూ ఆయా ఎమోజి ల అసలు అర్థం మనకు తెలియదు.

కెనడాలో ఇటీవల నడిచిన కేసు ఇది. సౌత్ వెస్ట్ టెర్మినల్, రైతుల నుంచి ధాన్యం కొనే కంపెనీ. ఇక క్రిస్ అచ్టర్ అనే అతడు ఒక రైతు. 2021 మార్చిలో సౌత్ వెస్ట్ టెర్మినల్ నుంచి క్రిస్ అచ్టర్ కు ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. “40 కేజీల అవిసె గింజల బ్యాగ్ ను రూ.1000 చొప్పున ధరకు కొంటాం. మాకు మొత్తం 86 టన్నుల అవిసె గింజలు కావాలి ” అని. ఈ మెసేజ్ చూశాక రైతు క్రిస్ అచ్టర్ ఫోన్‌ చేసి సౌత్ వెస్ట్ టెర్మినల్ కంపెనీ ప్రతినిధితో మాట్లాడాడు. ఆ తర్వాత 2021 నవంబర్‌లో అంటే 8 నెలల తరువాత సౌత్ వెస్ట్ టెర్మినల్ నుంచి రైతు క్రిస్ అచ్టర్ వాట్సాప్ కు ఒక ఫోటో వచ్చింది. దయచేసి అవిసెల అమ్మకం ఒప్పందాన్ని నిర్ధారించండి అని ఉంది అందులో. ఆ ఫోటోను డౌన్ లోడ్ చేసుకున్న రైతు .. దానికి థంబ్స్ అప్ ఎమోజితో రిప్లై ఇచ్చాడు. దీంతో తమకు అవిసె గింజలు అమ్మే అగ్రిమెంట్ కు రైతు క్రిస్ అచ్టర్ అంగీకరించాడని సౌత్ వెస్ట్ టెర్మినల్ కంపెనీ భావించింది. కానీ డెడ్ లైన్ గడుస్తున్నా.. అగ్రిమెంట్ ప్రకారం రైతు క్రిస్ అచ్టర్ నుంచి అవిసె గింజలు రాకపోవడంతో సౌత్ వెస్ట్ టెర్మినల్ కంపెనీ కోర్టును ఆశ్రయించింది.



కోర్టుకు వచ్చిన రైతు తాను ఆ ఫోటో రిసీవ్ అయ్యిందని చెప్పేందుకు మాత్రమే థంబ్స్ అప్ ఎమోజితో రిప్లై ఇచ్చాననీ, అంతేకానీ ఆ అగ్రిమెంట్ కు తాను ఓకే చెప్పలేదని అని వివరించాడు. అయితే గతంలో చాలామంది రైతులు థంబ్స్ అప్ ఎమోజితో అగ్రిమెంట్ కు ఓకే చెప్పిన స్క్రీన్ షాట్లను సౌత్ వెస్ట్ టెర్మినల్ కంపెనీ కోర్టుకు సబ్మిట్ చేసింది. అవిసె గింజలను రైతు సకాలంలో తమకు డెలివరీ చేయకపోవడంతో చాలా నష్టం జరిగిందని, అందుకు పరిహారాన్ని ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. దీంతో కోర్టు ఆ థంబ్స్ అప్ ఎమోజీని సంతకానికి సమానమైన అర్ధం ఇచ్చే సందేశంగా పరిగణిస్తూ తీర్పు ఇచ్చింది. అగ్రిమెంట్ ను ఉల్లఘించినందుకు రైతు క్రిస్ అచ్టర్ కు రూ.50 లక్షల పరిహారాన్ని సౌత్ వెస్ట్ టెర్మినల్ కంపెనీకి చెల్లించాలని ఆదేశించింది. అందుకే మీరు కూడా ఎమోజీలు వాడేటప్పుడు అలర్ట్ గా ఉండండి.V

Tags

Read MoreRead Less
Next Story