Twins : కవల పిల్లలు.. కానీ రెండు సంవత్సరాల్లో పుట్టారు. ఎలాగంటే?

Twins : సాధరణంగా కవల పిల్లలంటే కొన్ని నిమిషాల తేడాతో, లేకపోతే అదే రోజున పుడుతారు.. కానీ కాలిఫోర్నియాలో రెండు వేర్వేరు సంవత్సరాల్లో కవలలు పుట్టారు. 15 నిమిషాల వ్యవధిలో 2021లో బాబు, 2022లో పాప జన్మించారు. కాలిఫోర్నియాకు చెందిన ఫాతిమా మాడ్రిగల్ నిండు గర్భిణీ. నేటివిడాడ్ వైద్య కేంద్రంలో చేరిన ఆమెకు డిసెంబర్ 31న రాత్రి వేళ పురుటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో కొత్త ఏడాదికి కొన్ని నిమిషాల ముందు రాత్రి 11.45 గంటలకు బాబు ఆల్‌ఫ్రెడోకు జన్మనిచ్చింది. అనంతరం గడియారం ముల్లు 12కు చేరగా పాప ఐలిన్‌కు ఆమె జన్మనిచ్చింది. దీనితో రెండు విభిన్నమైన రోజుల్లో రెండు సంవత్సరాల్లో కవలలు పుట్టినట్లు అయింది. కవలలైన తన పిల్లలు కొన్ని నిమిషాల గ్యాప్‌లో వేర్వేరు సంవత్సరాల్లో పుట్టడంపై తాను ఆశ్చర్యపోయినట్లు తల్లి ఫాతిమా మాడ్రిగల్ తెలిపారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని నిపుణులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com