China: భయపెడుతున్న కరోనా లెక్కలు.. 90 కోట్ల మందికి..

China: 90 కోట్ల మంది చైనా ప్రజలు కోవిడ్ బారిన పడ్డారు. ఇది దేశ జనాభాలో 64 శాతం. వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో 91 శాతం మంది COVID-19 బారిన పడ్డారు. రాజధాని బీజింగ్‌కు నైరుతి దిశలో 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెకింగ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం గన్సు ప్రావిన్స్‌లో 20 కోట్ల మందికి కోవిడ్ సోకింది.
కొత్త సంవత్సరంలో గ్రామీణ చైనాలో కేసులు పెరుగుతాయని చైనా నివేదికలు పేర్కొన్నాయి. కోవిడ్ వేవ్ వచ్చే రెండు మూడు నెలల్లో గరిష్ట స్థాయికి చేరుకుంటుందని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. చైనాలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది వృద్ధులు, వికలాంగులకు కోవిడ్ చికిత్స సరిగా అందడం లేదని అధ్యయనం పేర్కొంది.
చైనాలో కోవిడ్ ఎందుకు అంతగా వ్యాప్తి చెందుతోంది?
జనవరి 23 నుండి ప్రారంభమయ్యే కొత్త సంవత్సర వేడుకల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంటారు. దీనిక కారణంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది. చైనాలో న్యూ ఇయర్ సెలవులు అధికారికంగా జనవరి 21 నుండి ప్రారంభమవుతాయి. ఈ సమయంలో పర్యటనలు విస్తృతంగా ఉంటాయి. దీనిని అరికట్టడంలో అధికారులు కూడా విఫలమవుతారు.
బీజింగ్, షాంఘై నగరాల ఆసుపత్రులు కోవిడ్ రోగులతో కిక్కిరిసిపోయాయి. కోవిడ్ మరణాలను చైనా చాలా తక్కువగా నివేదించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి చైనా 5,000 కోవిడ్ సంబంధిత మరణాలను మాత్రమే నివేదించిందని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com