Aeolus Satellite: డెడ్ శాటిలైట్ ను భూమిపైకి తెచ్చి కూల్చివేత

Aeolus Satellite: డెడ్ శాటిలైట్ ను భూమిపైకి తెచ్చి కూల్చివేత
చరిత్రలో తొలిసారి ప్రయోగం సక్సెస్

శాటిలైట్‌ను అంతరిక్షంలో ప్రవేశపెట్టడం మన వరకు మనకు తెలుసు. కానీ ఆ తరువాత అది డెడ్ అయితే దాని పరిస్థితి ఏంటి ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒక దగ్గర పడిపోతే ఎలా.. ప్రజలకు ప్రమాదం కదా. అందుకే శాస్త్రవేత్తలు ఒక కొత్త ప్రయోగం చేశారు. ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా డెడ్‌ శాటిలైట్‌ను తొలిసారి భూమిపైకి తెచ్చి సురక్షితంగా సముద్రంలో కూల్చివేశారు. దీని కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) ఇతర సంస్థలతో కలిసి ఏకంగా కొన్ని నెలలపాటు ప్లాన్‌ చేసాయి.

ఒక యూరోపియన్ ఉపగ్రహం ఇంధనం అయిపోయిన తర్వాత ఉద్దేశపూర్వకంగా అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయేలా తయారు చేయబడింది. ఏయోలస్ అనే సుమారు 1,360 కిలోల బరువున్న వాతావరణ పర్యవేక్షణ అంతరిక్ష నౌకను 2018లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసింది. ఈ శాటిలైట్‌ కాలపరిమితి ఐదేళ్లు. ఇప్పుడు దానిలోని ఇంధనంతోపాటు మిషన్‌ కాలపరిమితి ముగిసింది. దీంతో డెడ్‌ అయిన ఈ శాటిలైట్‌ 200 మైళ్లు (సుమారు 320 కిలోమీటర్ల ) ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతోంది. ఈ నేపథ్యంలో జర్మనీలోని మిషన్‌ కంట్రోల్‌ నుంచి శాటిలైట్‌ కక్ష్యను తగ్గించే చర్యలు చేపట్టారు. శాటిలైట్‌ ఏయోలస్‌ను సురక్షితంగా కూల్చివేయడం కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) ఇతర సంస్థలతో కలిసి కొన్ని నెలలపాటు ప్లాన్‌ చేసి కక్ష్యను తగ్గించే చర్యలు మొదలు పెట్టారు. ఈ నెల 24న ఆ డెడ్‌ శాటిలైట్‌ గతంలో 320 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది కాస్త 280 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నది. ఆ తర్వాత దానిని 250 కిలోమీటర్లకు తగ్గించారు. అలా క్రమంగా ఒక పద్ధతి ప్రకారం ఉపగ్రహం ఎత్తు తగ్గిస్తూ వచ్చారు. శుక్రవారం నాటికి భూమి నుంచి 120 కిలోమీటర్ల ఎత్తుకు ఏయోలస్‌ చేరుకున్నది. అనంతరం దాని కక్ష్యను మరింతగా మార్పు చేశారు. చివరకు ఆ శాటిలైట్‌ అట్లాంటిక్ మహాసముద్రంలో సురక్షితంగా కూలింది.



సాధారణంగా ఎక్కడో ఒక దగ్గర పడే ఉపగ్రహంతో పోలిస్తే ఇలా ప్లాన్ చేయడం వల్ల అనేక రకాల ప్రమాదాలు తగ్గుతాయని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ విధంగా ప్రమాదాలు 42 రెట్లు తగ్గుతాయని తెలిపింది.

భూమి, ఇతర గ్రహాల చుట్టూ గాలి వేగాన్ని కొలవడం ఈ ఏయోలస్‌ను ఉపగ్రహ లక్ష్యం. వాతావరణ సమాచారాన్ని అందించే కీలక ఉపాగ్రహాలలో ఒకటి. గ్రీకు పురాణాలలో గాలుల రక్షకుడిని ఏయోలస్ అని పిలుస్తారు. ఈ ఉపగ్రహం గాలి వేగాన్ని కొలిచేదే పని కాబట్టి, దీనికి ఏయోలస్ అని పేరు పెట్టారు.


Tags

Read MoreRead Less
Next Story