AFG: అఫ్గానిస్తాన్‌తో అంత ఈజీ కాదు

AFG: అఫ్గానిస్తాన్‌తో అంత ఈజీ కాదు
X
అఫ్గానిస్థాన్‌ను ఓడించడం అంత తేలిక కాదు.. సోవియట్, బ్రిటన్, అమెరికాకే సాధ్యం కాలేదు.. "సామ్రాజ్యాల స్మశానవాటిక"గా అఫ్గాన్‌కు పేరు

పా­కి­స్తా­న్‌-అఫ్గా­ని­స్తా­న్ మధ్య యు­ద్ధ వా­తా­వ­ర­ణం నె­ల­కొం­ది. ఇరు దే­శా­లు భీకర దా­డు­లు చే­సు­కు­న్నా­యి. ఇటీ­వల సరి­హ­ద్దు ఘర్ష­ణల తర్వాత 48 గంటల కా­ల్పుల వి­ర­మణ ప్ర­క­టిం­చా­రు. కానీ పరి­స్థి­తి ఇంకా ఉద్రి­క్తం­గా­నే ఉంది. ఖతా­ర్ మధ్య­వ­ర్తి­త్వం­లో రెం­డు పక్షాల మధ్య చర్చ­లు జరు­గు­తా­య­నే అం­చ­నా­లు వచ్చా­యి. మరో­వై­పు రెం­డు దే­శాల మధ్య వి­వా­దం మరింత పె­ర­గ­డం­పై ఆం­దో­ళన వ్య­క్త­మ­వు­తోం­ది. ఈ నే­ప­థ్యం­లో.. భా­ర­త­దే­శం­లో పర్య­టిం­చిన అఫ్గా­ని­స్తా­న్ వి­దే­శీ వ్య­వ­హా­రాల మం­త్రి అమీ­ర్‌­ఖా­న్ ము­త్తా­కీ చే­సిన ప్ర­క­టన కూడా చర్చ­నీ­య­మైం­ది. ఆయన పా­కి­స్తా­న్ పేరు ఎక్క­డా ప్ర­స్తా­విం­చ­కుం­డా ఒక హె­చ్చ­రిక జారీ చే­శా­రు. ము­త్తా­కీ మా­ట్లా­డు­తూ.. ‘అఫ్గా­న్ల ధై­ర్యా­న్ని పరీ­క్షిం­చ­వ­ద్దు. మీరు ఇలాం­టి­ది చే­యా­ల­ను­కుం­టే, మొదట బ్రి­ట­న్‌­ను అడ­గం­డి, సో­వి­య­ట్ యూ­ని­య­న్‌­ను అడ­గం­డి, అమె­రి­కా, నే­టో­ను అడ­గం­డి. అఫ్గా­ని­స్తా­న్‌­తో ఆట­లా­డ­క­పో­వ­డ­మే మం­చి­ద­ని వారు మీకు అర్థ­మ­య్యే­లా చె­ప్తా­రు’ అని పరో­క్షం­గా పా­కి­స్తా­న్‌­ను ఉద్దే­శిం­చి అన్నా­రు. అఫ్గా­ని­స్తా­న్ తా­లి­బా­న్ ప్ర­భు­త్వ ప్ర­తి­ని­ధి కూడా ఇటీ­వల అలాం­టి హె­చ్చ­రి­కే చే­శా­రు. ప్ర­పం­చం­లో­ని గొ­ప్ప శక్తు­లు, అగ్ర­రా­జ్యా­లు కూడా తగిన ఆర్మీ కానీ, సై­నిక వన­రు­లు కానీ లేని అఫ్గా­ని­స్తా­న్‌­ను ఓడిం­చ­లే­క­పో­యా­యి. 'సా­మ్రా­జ్యాల స్మ­శా­న­వా­టి­క' అని అఫ్గా­ని­స్తా­న్‌­కు పేరు ఉంది.

సామ్రాజ్యాల స్మశానవాటిక అఫ్గాన్

19వ శతా­బ్దం­లో.. ప్ర­పం­చం­లో­నే అత్యంత శక్తి­మం­త­మైన బ్రి­టి­ష్ సా­మ్రా­జ్యం అఫ్గా­ని­స్తా­న్‌­ను స్వా­ధీ­నం చే­సు­కో­వ­డా­ని­కి శత­వి­ధా­లా ప్ర­య­త్నిం­చిం­ది. కానీ బ్రి­ట­న్ చి­వ­ర­కు 1919లో అఫ్గా­ని­స్తా­న్‌­ను వి­డి­చి­పె­ట్టి, అఫ్గా­న్‌ పౌ­రు­ల­కు స్వా­తం­త్ర్యం ఇచ్చిం­ది. ఆ తర్వాత 1979లో సో­వి­య­ట్ యూ­ని­య­న్ అఫ్గా­ని­స్తా­న్‌­పై దం­డె­త్తిం­ది. 1978లో తి­రు­గు­బా­టు ద్వా­రా స్థా­పిం­చిన కమ్యూ­ని­స్టు ప్ర­భు­త్వం కూ­లి­పో­కుం­డా ఆపడం దాని లక్ష్యం. కానీ అఫ్గా­ని­స్తా­న్‌­తో యు­ద్ధం­లో గె­ల­వ­లే­మ­ని గ్ర­హిం­చ­డా­ని­కి వా­రి­కి పదే­ళ్లు పట్టిం­ది. బ్రి­టి­ష్ సా­మ్రా­జ్యం, సో­వి­య­ట్ యూ­ని­య­న్ మధ్య కొంత సా­రూ­ప్యత ఉంది. అఫ్గా­ని­స్తా­న్‌­పై దం­డె­త్తి­న­ప్పు­డు రెం­డు సా­మ్రా­జ్యా­లు అత్యంత శక్తి­మం­తం­గా ఉన్నా­యి. అఫ్గా­ని­స్తా­న్‌­పై దం­డ­యా­త్ర తర్వాత, ఆ రెం­డు సా­మ్రా­జ్యా­లు క్ర­మం­గా దె­బ్బ­తి­న­డం మొ­ద­లైం­ది. 2001లో అఫ్గా­ని­స్తా­న్‌­పై అమె­రి­కా దం­డ­యా­త్ర ఫలి­తం­గా సం­వ­త్స­రాల పాటు సా­గిన యు­ద్ధం­తో లక్ష­లా­ది మంది ప్రా­ణా­లు కో­ల్పో­యా­రు. ఇరవై సం­వ­త్స­రాల తర్వాత, అప్ప­టి అమె­రి­కా అధ్య­క్షు­డు జో బై­డె­న్ అఫ్గా­ని­స్తా­న్ నుం­చి తన దళా­ల­ను ఉప­సం­హ­రిం­చు­కో­వా­ల­ని ని­ర్ణ­యిం­చు­కు­న్నా­రు. దీం­తో అమె­రి­కా సై­న్యం ఉప­సం­హ­ర­ణ­కు, తా­లి­బా­న్లు తి­రి­గి అధి­కా­రం­లో­కి రా­వ­డా­ని­కి మా­ర్గం సు­గ­మ­మైం­ది. ఇలా ఎవరూ కూడా అఫ్గా­న్‌­ను గె­ల­వ­లే­క­పో­యా­రు.

Tags

Next Story