అమెరికన్లకు డబ్బులిచ్చి వివాహం చేసుకుంటున్న అఫ్ఘాన్ మహిళలు..!

అఫ్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. దేశంలో పూర్తిస్థాయి పాలనకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఏర్పాట్లకు సంబంధించిన చర్చలు, కేబినెట్ కూర్పును పూర్తి చేసారు. తాలిబన్ ప్రభుత్వాధినేతగా ముల్లా బరాదర్ పేరును ఖరారు చేసారు. ఈ విషయాన్ని తాలిబన్ అధికార ప్రతినిధి అహ్మదుల్లా ముత్తఖీ తెలిపారు. తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా యాకూబ్, షేర్ మహమ్మద్ స్టాన్జాయ్‌లకు కీలక స్థానాలు దక్కినట్లు తెలుస్తోంది. పాలనా పగ్గాలు చేపట్టనున్న ముల్లా బరాదర్.. త్వరలోనే కాబుల్‌లో బహిరంగంగా కనిపించనున్నట్లు తాలిబన్ నేతలు అంటున్నారు.
తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎలా ఉండాలి..? అన్న దానిపై కసరత్తు పూర్తి చేసింది. తాలిబన్ లీడర్ షిప్ కౌన్సిల్ ద్వారా అప్ఘానిస్తాన్‌లో ఇకపై పరిపాలన సాగనుంది. రోజువారీ పరిపాలనా వ్యవహారాలను తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ నాయకత్వంలోని ప్రత్యేక మండలి చూసుకుంటోంది. అఫ్ఘాన్‌లో పరిపాలన కోసం ఎలాంటి మండలి ఏర్పాటైనా.. తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంద్‌జాదా అధినాయకుడిగా ఉంటారని తాలిబన్ సాంస్కృతిక కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. అప్ఘానిస్తాన్‌లో ప్రజస్వామ్యం ఇక ఉండబోదని.. అటువంటి వ్యవస్థకు తమ దేశంలో పునాది లేదని తాలిబన్ ఇప్పటికే సృష్టం చేసింది.
అప్ఘాన్‌లోని అన్ని రాష్ట్రాలను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లకు షంజ్‌షేర్ మాత్రం వణుకు పుట్టిస్తోంది. పంజ్‌షేర్‌లోకి వెళ్లేందుకు పలుమార్లు ప్రయత్నించిన అనేక మంది తాలిబన్లను అక్కడి సేనలు ముట్టుబెట్టారు. ప్రావిన్స్ పూర్తిగా తమ ఆధీనంలోనే ఉందని పంజ్‌షేర్ ఉత్తర కూటమి సేనలు ప్రకటించాయి. పంజ్‌షేర్ ఆక్రమణ కోసం తాలిబన్లు యుద్ధానికి వస్తే వారిని నేరుగా నరకానికి పంపుతామని అక్కడి సైన్యం హెచ్చరించింది.
కాబూల్ ఎయిర్‌పోర్టు బయట దారుణమైన పరిస్థితులే దర్శనిస్తున్నాయి. తాలిబన్ల గురించి భయపడుతూ దేశ పౌరులు వలసపోయేందుకు విమానాశ్రయం దగ్గరే ఎదురుచూస్తున్నారు. ఇక.. దేశాన్ని వదిలి పారిపోవాలనుకుంటున్న అప్ఘాన్ మహిళలు కొత్త దారి వెతుక్కుంటున్నారు. తాలిబన్ పాలన నుంచి తప్పించుకునేందుకు కొందరు మహిళలు.. అమెరికన్లను తమ భర్తలని చెప్పుకుని దేశం దాటి వెళ్లిపోతున్నారు. ఇంకొందరైతే.. విదేశీయులని చెప్పుకునేందుకు అమెరికన్లకు ఎదురు డబ్బులిచ్చి వివాహం చేసుకుంటున్నారు అఫ్ఘాన్ మహిళలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com