అంతర్జాతీయం

తాలిబన్ల పాలన.. ఆమెకు అన్నీ ఆంక్షలే..

ఆఫ్ఘన్ మహిళల జీవితాలు ఇప్పుడు తాలిబన్ల ఆధీనంలో ఉన్నాయి.

తాలిబన్ల పాలన.. ఆమెకు అన్నీ ఆంక్షలే..
X

ఆఫ్ఘన్ మహిళల జీవితాలు ఇప్పుడు తాలిబన్ల ఆధీనంలో ఉన్నాయి. తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం నిస్సందేహంగా మహిళల జీవితాలను ప్రమాదంలో పడేసింది. వారి హక్కులను కాలరాసింది. వారి స్వేచ్చా జీవితానికి సంకెళ్లు వేసింది. తాలిబాన్ స్వాధీనానికి ముందు మహిళలు సురక్షితంగా ఉన్నారు.

కానీ ఇప్పుడు వైద్యుడి వద్దకు వెళ్లడానికి కూడా అంగరక్షకుడు అవసరం ఏర్పడింది. చాలా మంది మహిళలు తాలిబన్ల గురించి మాట్లాడతారు. వారితో జరిగిన సంఘర్షణలో తండ్రులు, సోదరులు ఎలా చంపబడ్డారు లేదా దోపిడీ చేయబడ్డారో వివరిస్తారు.

తాలిబన్ల పేరు విన్నా. వారి రూపు రేఖలు చూసినా భయభ్రాంతులకు గురవుతున్నారు ఆఫ్గన్ మహిళలు. వారి అరాచక పాలన గుర్తొస్తే గొంతులో ముద్ద దిగట్లేదు. మా పాలనలో మీరు సురక్షితంగా ఉండొచ్చని ప్రగల్భాలు పలికిన కొద్ది రోజులకే వారి విశ్వ రూపాన్ని చూపిస్తున్నారు.

ఆగస్టు 17న ఆప్గన్ మహిళ సరిగా వండి పెట్టలేదని ఆమెను కాల్చి చంపేశారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చదువుకోకూడదన్నారు. అమ్మాయిలకు బోధించేందుకు ఉపాధ్యాయునిలు మాత్రమే ఉండాలని రూల్స్ పాస్ చేశారు. హైహీల్ ధరించకూడదు. బురఖా లేకుండా బయటకు రాకూడదు.

మగ వారితో మాట్లాడకూడదు. ఇంటి కిటికీలు ఎత్తులో ఉండాలి. మహిళలు బాల్కనీలో నిలబడకూడదు. రేడియో, టీవీల్లో మహిళలు పాడడానికి వీల్లేదు. మహిళలను గౌరవిస్తామని చెబుతూనే.. అవి ఇస్లామిక్ చట్టాలకు లోబడి ఉంటాయని చెప్పడం పాతికేళ్ల నాటి రోజులు మళ్లీ వస్తాయనేదానికి నిదర్శనం.

Next Story

RELATED STORIES