Afghanistan: ఎంత మొత్తుకున్నా మా ఉనికి ఉండాల్సిందే...!

Afghanistan: ఎంత మొత్తుకున్నా మా ఉనికి ఉండాల్సిందే...!
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆఫ్ఘనిస్థాన్ లో మహిళల కార్యక్రమం; మహిళలతో కూడిన పానెల్ డిస్కషన్...

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆఫ్ఘనిస్థాన్ లో అరుదైన ఘనట చోటుచేసుకుంది. తాలిబన్ నాయకత్వంలోకి వచ్చాక మహిళలు తెర మీద కనిపించకూడదు అన్న నిబంధన విధించడంతో అప్పటి వరకూ న్యూస్ రీడర్లుగా, రిపోర్టర్లుగా విధులు నిర్వహించిన వారందరూ తెర వెనుకకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో మహిళా దినోత్సవం రోజున టోలో న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో వివిధ రంగాలకు చెందిన మహిళలు పాల్గొని ధైర్యంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. అయితే అందరూ పూర్తి బూర్ఖా ధరించి, ముఖానికి సర్జికల్ మాస్క్ లు ధరించి ఉన్నారు. ఇస్లామ్ లో మహిళల ఉనికి పేరిట సాగిన చర్చాగోష్ఠిలో తాలిబన్ లు ఎంత కాదన్నా మహిళలు ఈ సమాజంలో అంతర్భాగమేనని జకీరా నుబిల్ అనే ప్రొఫెసర్ వ్యాఖ్యానించారు. పాఠశాలకు వెళ్లి చదువుకోలేక పోతే ఇంటి దగ్గరే అమ్మాయిలు లోక జ్ఞానం పొందుతారని, అంతేకానీ, మహిళలను పూర్తిగా అణచివేయడం ఎవరి తరమూ కదాని స్పష్టం చేశారు. ఇస్లామ్ లోనూ మహిళలకు సమాన హక్కులు ఉన్నాయని, ఆమెకు చదువుకునేందుకు, పని చేసేందుకు హక్కులు ఉన్నాయని మరో పానలిస్ట్, విలేఖరి అస్మా ఖోగ్యానీ వ్యాఖ్యానించారు. ఏమైనా ఈ చర్చ అంతర్జాతీయ మీడియాలోనూ ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story