Afghanistan : మహిళల హక్కులు మంట గలిసిపోతున్నాయి

Afghanistan : మహిళల హక్కులు మంట గలిసిపోతున్నాయి
యూనివర్శిటీ ప్రవేశ పరీక్షకు మహిళలు అనర్హులు అంటూ తాలిబన్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది

తాలిబన్ల పాలనలో ఆఫ్గనిస్తాన్ మహిళల హక్కులు మంట గలిసిపోతున్నాయి. ఓవైపు పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకు పోతుంటే.. . అఫ్గాన్ మహిళలు మాత్రం తమ కనీస హక్కులకు కూడా నోచుకోలేకపోతున్నారు. ఇప్పటికే మహిళా విద్యను నిర్బంధిస్తూ అనేక ఆంక్షలు, పరిమితులు విధించిన తాలిబన్‌ సర్కారు.. మరో అణచివేత చర్యకు సిద్ధమైంది. తాజాగా యూనివర్శిటీ ప్రవేశ పరీక్షకు మహిళలు అనర్హులు అంటూ తాలిబన్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అఫ్గానిస్థాన్ మహిళల హక్కులను తాలిబన్లు ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. కఠిన ఆంక్షలతో వారిని విద్యకు దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పాఠశాల విద్యపై కఠిన ఆంక్షలు కొనసాగుతుండగా.. తాజాగా యూనివర్శిటీ ప్రవేశ పరీక్షకు మహిళలు హాజరుకాకుండా తాలిబన్ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ఈ మేరకు అన్ని విశ్వవిద్యాలయలకు ఉత్తర్వులు జారీ చేసింది.

తాలిబన్‌ ప్రభుత్వం నిర్ణయంపై పలు ప్రజా, స్వచ్ఛంద సంస్థలు ఆందోళన చేపట్టాయి. మహిళలకు యూనివర్శిటీ విద్యను దూరం చేయడాన్ని పలు ఇస్లామిక్‌ దేశాలు కూడా ఖండించాయి. ఇప్పటికే తాలిబన్‌ ప్రభుత్వం మహిళలకు వ్యతిరేకంగా పలు చట్టాలను అమల్లోకి తెచ్చింది. మహిళలు పార్కులు, జిమ్​లు వాడకుండా నిషేధం విధించింది. తాజా నిర్ణయం మహిళా హక్కుల అణిచివేతే అని ప్రపంచ దేశాలు విమర్శించాయి.

Tags

Read MoreRead Less
Next Story