అఫ్గానిస్థాన్‌ శరణార్థులకు అండగా జీ-7 దేశాల నిర్ణయం

అఫ్గానిస్థాన్‌ శరణార్థులకు అండగా జీ-7 దేశాల నిర్ణయం
Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మారణహోమం సృష్టిస్తున్నారు. కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద చోటుచేసుకుంటున్న హృదయవిదారక దృశ్యాలే

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మారణహోమం సృష్టిస్తున్నారు. కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద చోటుచేసుకుంటున్న హృదయవిదారక దృశ్యాలే అందుకు నిదర్శనం. మానవత్వం మరిచి మారణకాండ సృష్టిస్తున్న తాలిబన్ల చెర నుంచి బయటపడేందుకు అఫ్గాన్ వాసులు కష్టాలు పడుతున్నారు. పిల్లలు, మహిళలు, పౌరులు పడుతున్న ఆ కష్టాలు అంతర్జాతీయ సమాజాన్ని కదిలిస్తున్నాయి.. కలిచివేస్తున్నాయి. అఫ్గాన్ పౌరుల నిస్సహాయస్థితి చూసి పలు దేశాలు శరణార్థులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్‌లో శరవేగంగా మారుతున్న పరిణామాలపై జీ-7 దేశాలు వర్చువల్ ద్వారా చర్చలు జరిపాయి. ఈ బృందంలో సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్ ఉమ్మడి వ్యూహం, కార్యాచరణను రూపొందించాయి. ఆఫ్ఘన్ శరణార్ధులకు సాయం అందించాలని నిర్ణయించినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. మరోవైపు.. ఆగస్ట్ 31లోగా అమెరికా సైన్యం అఫ్ఘాన్ నుంచి వెళ్లిపోవాలంటూ ఇప్పటికే తాలిబాన్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జీ-7 దేశాల ఉమ్మడి ప్రణాళిక ప్రాధాన్యత సంతరించుకుంది.

అమెరికా.. సుమారు 30 వేల మంది ఆఫ్ఘన్‌ పౌరులకు పునరావాసం కల్పించాలని నిర్ణయించింది. అలాగే కెనడా 20వేల మందికి ఆశ్రయం కల్పిస్తామని ప్రకటించింది. బ్రిటన్‌ సైతం అఫ్గాన్‌ పౌరులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. మహిళలు, చిన్నారులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని బ్రిటన్ నిర్ణయించింది. అప్గానిస్థాన్‌ ప్రజలకు ఆపన్నహస్తం అందించేందుకు.. అక్కడి పౌరులకు అండగా నిలబడాలని భారత్ భావిస్తోందని విదేశాంగశాఖ అధికారులు భావిస్తున్నారు. అమెరికా అభ్యర్థనతో ఉగాండా 2వేల మంది శరణార్థుల కోసం తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేస్తోంది.

ఆఫ్గాన్‌లో రోజురోజుకు తాలిబన్లకు చావుదెబ్బలు ఎదురవుతున్నాయి. బగ్లాన్‌ ప్రావిన్సులో జరిగిన సాయుధ తిరుగుబాటులో 50 మందికి పైగా తాలిబన్‌ ఫైటర్లు హతమయ్యారు. తాలిబన్లపై తిరగబడుతున్న జనం.. తమ ఆయుధ పోరాటంతో మూడు జిల్లాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన తాలిబన్లు.. 24 గంటల్లోనే ఆ మూడు జిల్లాలను తిరిగి ఆక్రమించుకున్నారు. కాకపోతే, ఈ ఘర్షణలో 50 మందికి పైగా తాలిబన్‌ ఫైటర్లు హతమయ్యారు.

మృతుల్లో జిల్లా తాలిబన్‌ చీఫ్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతకుముందు షంజ్‌షీర్‌ దాడిలో 300 మంది తాలిబన్లు హతమార్చినట్లు అక్కడి సైన్యం ప్రకటించింది. దీంతో దిగొచ్చిన తాలిబన్లు.. పంజ్‌షీర్‌ పెద్దలతో చర్చలకు తాలిబన్లు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆఫ్గాన్‌ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా, తాలిబన్లను మట్టుబెడతామన్న అహ్మద్‌ మసౌద్‌ ముందుగా తాలిబన్లు చర్చలు జరుపుతారని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story