కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పులు.. భారీగా ప్రాణ నష్టం

కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పులు.. భారీగా ప్రాణ నష్టం
Afghanistan:కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌లో సోమవారం జరిగిన ఘటనలో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Afghanistan: కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌లో సోమవారం జరిగిన ఘటనలో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. తొక్కిసలాట, అమెరికా బలగాల కాల్పుల కారణంగా 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాలిబన్‌ కమాండర్‌ మొహిబుల్లా హెక్మత్‌ వెల్లడించారు. విమానాశ్రయానికి రావొద్దని, ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించారు. విమానాశ్రయంలో సోమవారం నాటి గందరగోళంలో ఏడుగురు చనిపోయినట్లు వార్తలొచ్చాయి. అయితే.. ఈ సంఖ్య ఇప్పుడు 40కి చేరింది.

కాబుల్‌ నుంచి సోమవారం కతర్‌ చేరుకున్న తమ వాయుసేన విమానం 'సి-17 గ్లోబ్‌మాస్టర్‌' చక్రాలపై ఓ వ్యక్తి మృతదేహం లభించినట్లు అమెరికా వెల్లడించింది. ఈ అంశంపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది. కాబుల్‌లో సోమవారం వందల మంది ఆ విమానాన్ని ఎక్కేందుకు ప్రయత్నించడం, టేకాఫ్‌ అయ్యాక కూడా కొందరు చక్రాలు-రెక్కల భాగాల వద్ద వేలాడుతూ కనిపించడం కలకలం సృష్టించింది. విమానం గాల్లోకి ఎగిరాక జారిపడి ముగ్గురు మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story