Afghanistan Blast: | కాబూల్‌ హోటల్‌లో పేలుడు.. ఏడుగురు మృతి

Afghanistan Blast: | కాబూల్‌ హోటల్‌లో పేలుడు.. ఏడుగురు మృతి
X
చైనీయులే టార్గెట్‌గా ఆత్మాహుతి దాడి!

ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లో చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. తాలిబన్ అధికారుల కథనం ప్రకారం.. ఈ పేలుడులో అనేక మంది మరణించారు. కాబూల్‌లోని న్యూ సిటీ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చైనా పౌరులు నివసిస్తున్నారు. మృతదేహాల సంఖ్య ఇంకా పేరే అవకాశం ఉందని ఆఫ్ఘన్ ప్రభుత్వం చెబుతోంది. పేలుడులో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాబూల్ వీడియోలో పేలుడు తర్వాత తొక్కిసలాట జరిగినట్లు కనిపిస్తుంది.

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి జరిగినట్లు తాలిబన్ అంతర్గత మంత్రి ధృవీకరించారని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఈ దాడిలో అనేక మంది మరణించారని పేర్కొంది. ఈ దాడి ఒక చైనీస్ రెస్టారెంట్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదించింది. ఆ రెస్టారెంట్ పేరు లాన్‌జౌ బీఫ్ నూడుల్స్. ఈ సంఘటనపై చైనా ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ సందర్భంగా తాలిబన్ పోలీసు ప్రతినిధి ఖలీద్ జద్రాన్ మాట్లాడుతూ.. ఆత్మాహుతి దాడిపై దర్యాప్తు ప్రారంభించాము. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని వెల్లడించారు.

Tags

Next Story