రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువ క్రికెటర్..

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువ క్రికెటర్..
జలాలాబాద్‌లోని ఈస్టన్ నంగ్రహార్‌లో రోడ్డు దాటుతున్న సమయంలో తర్కారీని ఓ కారు ఢీకొట్టింది.

అఫ్ఘానిస్తాన్ ఓ యువ క్రికెటర్‌ను కోల్పోయింది. గత వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అఫ్ఘాన్ బ్యాట్స్‌మెన్ నజీబ్ తర్కారీ చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచాడు. జలాలాబాద్‌లోని ఈస్టన్ నంగ్రహార్‌లో రోడ్డు దాటుతున్న సమయంలో తర్కారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అతడు కోమాలోకి వెళ్లాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు. తర్కారీ మరణించిన విషయాన్ని అప్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

తమ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్, మంచి వ్యక్తిత్వం ఉన్న నజీబ్ తర్కారీ (29) మరణం పట్ల అప్ఘాన్ క్రికెట్ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది.నజీబ్ తర్కారీ 12 టీ 20, ఒక వన్డేల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.కుడిచేతి వాటం కలిగిన బ్యాట్స్‌మన్ నజీబ్ 2014 బంగ్లాదేశ్‌లో జరిగిన టి 20 ప్రపంచ కప్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతడి అత్యధిక అంతర్జాతీయ స్కోరు 90, ఇది మార్చి 2017 లో టి 20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో ఐర్లాండ్‌‌తో తలపడింది. తర్కారీ చివరి అంతర్జాతీయ ప్రదర్శన 2019 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగింది.

Tags

Read MoreRead Less
Next Story