అష్రఫ్ ఘనీ దేశం నుంచి ఎంత డబ్బుతో పారిపోయారో తెలుసా..?

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు శరవేగంగా ఆక్రమించుకున్నారు. అమెరికా, నాటో దళాలను సైతం వెళ్లిన ఆరు నెలల్లోనే ఆఫ్గానిస్తాన్ ను వారు హస్తగతం చేసుకున్నారు. అఫ్గన్‌లో తాలిబన్ల పాలన ప్రారంభమైంది. అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం నుంచి వెళ్లిపోయారు. ఘనీ ప్రస్తుతం ఏ దేశానికి వెళ్లారన్నదానిపై కచ్చితమైన సమాచారం లేదు. అయితే ఘనీ కట్టల కొద్ది డబ్బుతో దేశాన్ని వీడారని రష్యా దౌత్యకార్యాలయం ప్రకటించినట్లు ఓ వార్తా కథనంలో వచ్చింది.
అష్రాఫ్ ఘనీ దేశం నుంచి వెళ్లేముందు. 4 కార్లు, ఒక హెలికాప్టర్‌లో పట్టేమొత్తాన్ని ఆయన తన వెంట తీసుకెళ్లారని, అయితే వాటిలో కూర్చడం కుదరక అక్కడే కొంత మొత్తాన్ని వదలాల్సి వచ్చిందని రష్యా దౌత్యకార్యాలయానికి చెందిన అధికార ప్రతినిధి వెల్లడించారు. నికితా ఇషెంకో మాట్లాడుతూ..'అష్రాఫ్ ఘనీ వెళ్లేప్పుడు వెంట పెద్ద మొత్తంలో డబ్బు తీసుకెళ్లారు. నాలుగు కార్లను డబ్బుతో నింపేశారు. మరికొంత మొత్తాన్ని హెలికాప్టర్‌లో సర్దారు. వాటిలో పట్టకపోవడంతో మరికొంత సొమ్మును అక్కడే వదిలేశారు' అని చెప్పారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఓ వార్తా సంస్థకు వెల్లడించారు. అయితే ఆ వార్తలు ఎంతవరకు నిజమనేది తెలియరాలేదు.
అష్రాఫ్ ఘనీ తొలుత తజికిస్థాన్‌కు వెళ్లనున్నారని వార్తలు వచ్చాయి. ఆ దేశం అనుమతించకపోవడంతోఒమన్ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి అమెరికాకు వెళ్లనున్నారని సమాచారం. అయితే దీనిపై ఎలాంటి సమాచారం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com