Bahrain: బహ్రెయిన్‌లో స్వామినారాయణ దేవాలయం.. ఏడాదిలోగా పూర్తి

Bahrain: బహ్రెయిన్‌లో స్వామినారాయణ దేవాలయం.. ఏడాదిలోగా పూర్తి
X
Bahrain: స్వామినారాయణ దేవాలయం కోసం భూమి కేటాయింపు చేసినందుకు బహ్రెయిన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్, ప్రధాన మంత్రి అయిన సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

Bahrain: అబుదాబి తర్వాత బహ్రెయిన్‌లోని అబు మురీఖాలో BAPS హిందూ దేవాలయాన్ని నిర్మించనున్నారు. దీంతో మధ్యప్రాచ్యంలో హిందూ దేవాలయం నిర్మించే రెండో దేశంగా బహ్రెయిన్ నిల్వనుంది. స్వామినారాయణ దేవాలయం కోసం భూమి కేటాయింపు చేసినందుకు బహ్రెయిన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్, ప్రధాన మంత్రి అయిన సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

అబుదాబిలో BAPS హిందూ మందిర్ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న మత గురువు బ్రహ్మవిహారి స్వామి బహ్రెయిన్ టెంపుల్ నిర్మాణం కోసం రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ప్రిన్స్ సల్మాన్‌ లను అనేకసార్లు కలిసి చర్చించారు. అబుదాబిలోని BAPS హిందూ మందిర్ ఛైర్మన్ అశోక్ కొటేచా మాట్లాడుతూ.. ఇటువంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు బహ్రెయిన్, భారతదేశం నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

BAPS స్వామినారాయణ్ సంస్థ బహ్రెయిన్‌లో "ప్రపంచ సామరస్యానికి ఆధ్యాత్మిక ఒయాసిస్" లాంటి టెంపుల్ ని నిర్మిస్తుందని కోటేచా చెప్పారు. యూఏఈ మొట్టమొదటి సాంప్రదాయ రాతి దేవాలయం నిర్మాణ పనులు అబుదాబిలో జరుగుతున్నాయని, వచ్చే ఏడాది పూర్తవుతుందని కొటేచా తెలిపారు.

ఆలయంలో ఉపయోగించిన చేతితో చెక్కబడిన పింక్ ఇసుకరాయి భారతదేశం యొక్క గొప్ప సంస్కృతి, చరిత్రను ప్రతిబింబిస్తుందన్నారు. అలాగే అరబ్ చిహ్నాలను కలిగి ఉండటంతోపాటు ఏడు గోపురాలు ఉంటాయన్నారు. ఈ ఆలయం కనీసం 1,000 సంవత్సరాల పాటు నిలిచి ఉంటుందని ఆయన చెప్పారు.

Tags

Next Story