WAR: రష్యా యుద్ధంలో ఉక్రెయిన్‌కు భారీ నష్టం

WAR: రష్యా యుద్ధంలో ఉక్రెయిన్‌కు భారీ నష్టం
యుద్ధంలో ఉక్రెయిన్‌ భారీగా నష్టపోయిందన్న రష్యా... ఆయుధ సంపత్తిని ధ్వంసం చేసినట్లు ప్రకటన

రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు ఎదురుదాడికి దిగిన ఉక్రెయిన్( Ukraine) భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఆగ్నేయ ఉక్రెయిన్ లో రష్యా, ఉక్రెయిన్ దళాల మధ్య భీకర పోరు జరిగింది. 1500 కిలో మీటర్ల( 1,500-kilometer) మేర ఫ్రంట్ లైన్‌లో అనేక చోట్ల ఇరుదేశాల సైన్యాల మధ్య కొన్ని వారాలుగా పోరాటం జరుగుతోంది. పశ్చిమ దేశాల నుంచి లభించిన ఆయుధాల(weapons )తో రష్యా(Russia)పై ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగింది.


అయితే జపోరిజియా ప్రాంతం(Zaporizhzhia region )లో ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా నష్టపోయినట్లు రష్యా ప్రకటించింది. భారీగా ఉక్రెయిన్ ఆయుధ సామాగ్రి(Ukraine's military equipment )ని ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. అనేక మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు( heavy losses to Kyiv's forces) తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోలు విడుదల చేసింది. ఉక్రెయిన్ ఎదురుదాడి ఫలించలేదని వెల్లడించింది. ఇటీవల ఆ ప్రాంతానికి వేలాది మంది సైనికులను ఉక్రెయిన్( Ukraine ) పంపింది. ఐతే రష్యా చేసిన ప్రకటనపై ఉక్రెయిన్ స్పందించలేదు. తమ బలగాలు జపోరిజియా ప్రాంతంలోని మెలిటోపోల్ నగరం దిశగా దూసుకెళ్తున్నట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ ఉప మంత్రి వెల్లడించారు.


మరోవైపు ఆఫ్రికా దేశాలకు ఉచితంగా ఆహార ధాన్యాల ఎగుమతులను కొనసాగిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్( Russian President Vladimir Putin ) తెలిపారు. 2022లో 11.5 మిలియన్ టన్నుల ధాన్యాలను ఎగుమతి చేస్తే ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో ఇప్పటికే 10 మిలియన్ టన్నులను ఎగుమతి చేశామని అన్నారు. ఆహార ధాన్యాలు, ఎరువుల ఎగుమతులకు పశ్చిమ దేశాలు అడ్డంకులు సృష్టించి ప్రస్తుత ఆహార సంక్షోభానికి తామే కారణమనే నిందలు వేస్తున్నాయని విమర్శించారు.


వచ్చే మూడు నెలల్లో 25 వేల నుంచి 50 వేల టన్నుల ధాన్యాన్ని మాలీ, జింబాబ్వే, సొమాలియా, ఎరిత్రియా దేశాలకు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచ గోధుమ మార్కెట్ లో రష్యా వాటా 20శాతమన్న పుతిన్, ఉక్రెయిన్ వాటా ఐదు శాతమేనని వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆహార భద్రతకు రష్యా గణనీయమైన కృషి చేస్తున్న విషయాన్ని ఈ గణంకాలు రుజువు చేస్తున్నాయని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story