Pakistan: అడుక్కుతింటున్న పాకిస్తాన్- సెనేట్‌లో చర్చలో వెల్లడి

పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది అన్న విషయం తెలిసిందే. ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా ఉన్న దాయాది దేశం దక్షిణాసియాతో పాటు యూరప్ దేశాలకు ఉగ్రవాదాన్ని భీభత్సంగా ఎగుమతి చేసింది. తర్వాత తన ఆర్థిక కష్టాల నుంచి గట్టేక్కడానికి చైనాకు గాడిదనలు ఎగుమతి చేసింది. కానీ ఇప్పుడు ఆ దేశం బిచ్చగాళ్లు, దొంగలను కూడా ఎగుమతి చేస్తోంది. బెగ్గర్లను దేశం దాటించడాన్ని మానుకోవాలని సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాలు పాకిస్తాన్‌ను అభ్యర్ధించడం పరిస్ధితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తూ పొరుగు దేశాల్లో అలజడి రేపడంలో పాకిస్తాన్ పేరొందిన సంగతి తెలిసిందే. పాక్ కుయుక్తులకు భారత్ ఏ స్ధాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నదీ ప్రపంచం చూస్తూనే ఉంది. ఇక ఉగ్రవాదం, గాడిదల ఎగుమతులకు తోడు పాకిస్తాన్ ఇప్పుడు యాచకులనూ ఎగుమతి చేస్తోంది. సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాల్లో పట్టుబడుతున్న బిచ్చగాళ్లలో పాకిస్తాన్ దేశానికి చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. ఈ దేశాలు బిచ్చగాళ్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని పాక్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయంటే వారి అడుక్కోవడం ఏ రేంజులో ఉందో అర్థమవుతోంది.
మక్కా గ్రాండ్ మసీదు వెలుపల అరెస్టు అవుతున్న పిక్ పాకెటర్లలో ఎక్కువ మంది పాకిస్తానీయులే ఉంటున్నారు. పాకిస్తాన్ నుంచి బిచ్చగాళ్లు ఎక్కువగా పశ్చిమాసియా దేశాలకు తరలివెళ్తున్నట్లుగా ‘స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఓవర్సీస్ పాకిస్తానీస్’ ఆందోళనను వెలిబుచ్చింది. ద్రవ్యోల్బణం చుక్కలు చూస్తుండటంతో ఆహారం, ఇంధన ధరలు పైపైకి ఎగబాకుతుండటంతో పాకిస్తాన్‌లో పేదల పరిస్ధితి దయనీయంగా మారింది. పాక్ నుంచి యాచకులు పశ్చిమాసియా దేశాల బాట పడుతున్నారు. యాత్రికుల పేరుతో తమ దేశాలకు వస్తున్న పాకిస్తానీలు ఆపై యాచకలుగా మారుతున్నారని, ఇరాక్, సౌదీ అరేబియా దౌత్యవేత్తలు పాకిస్తాన్‌కు నివేదించారు. మక్కా ఉమ్రా యాత్రకు ముసుగులో వీసాలపై వెళ్తున్న పాకిస్తాన్ జాతీయులు అక్కడికి వెళ్లి బిక్షాటన చేస్తున్నారని ఇరాక్, సౌదీ రాయబారులు తమకు తెలిపారని ఆయన అన్నారు. 10 మిలియన్ల పాకిస్తాన్ పౌరులు విదేశాల్లో నివసిస్తున్నారని, వీరిలో ఎక్కువ సంఖ్యలో భిక్షాటన చేస్తున్నారని తెలియజేశారు.
ఇలాంటి వారు వీసాలు పొంది వేరే దేశాల్లో భిక్షాటనను ఆశ్రయిస్తున్నారు, పాక్ నుంచి మిడిల్ ఈస్ట్ వెళ్లే విమానాలు బిచ్చగాళ్లతో నిండిపోతున్నాయి. యూఏఈలో 16 లక్షల మంది, ఖతార్ లో రెండు లక్షల మంది పాకిస్తానీలు ఉన్నారు. ఇదే కాకుండా ఇరాక్, సౌదీ దౌత్యవేత్తలు తమ జైళ్లు బిక్షగాళ్లతో నిండిపోయాయని చెబుతున్నారు. అంటే కాదు కొంతమంది దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారని అంటున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఉన్న పాకిస్తాన్ అక్కడ ప్రజలకు నిత్యావసరాలు, కనీస సౌకర్యాలను కూడా కల్పించలేకపోతోంది. బడ్జెట్ లో చాలా వరకు సైన్యానికే వెళ్తుండటం, సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు పెట్టకపోవడం వంటి వాటి వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com