Ingenuity: ముగిసిన ఇంజెన్యూటీ కథ

అంగారక గ్రహంపై ఎగిరిన తొలి హెలికాప్టర్ ఇంజెన్యూటీ ప్రయాణం ముగిసింది. మూడేళ్లు అంగారకుడిపై ప్రయాణించిన ఈ హెలికాప్టర్‌లో రోటర్ బ్లేడ్లు విరిగిపోయినట్లు నాసా ప్రకటించింది. భూమిపై కాకుండా మరో గ్రహంపై ఎగిరిన తొలి లోహ విహంగంగా ఇది రికార్డు సృష్టించింది. సౌరకుటుంబంలోని ఇతర గ్రహాలపై కూడా విమానాలు, హెలికాప్టర్లను ఎగరవేయవచ్చునని ఇంజెన్యుటీ ప్రయోగం ద్వారా నాసా నిరూపించింది. అంగారకుడిపై పరిశోధనలు చేసిన ఇంజెన్యుటీ హెలికాప్టర్.. ఇకపై ఎగరలేదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. 1800 గ్రాముల బరువున్న ఈ చిన్న హెలికాప్టర్‌లోని రోటర్ బ్లేడ్లు విరిగిపోయినట్లు గుర్తించామని పేర్కొంది. ఈ గ్రహాంతర హెలికాప్టర్ నుంచి నాసాకు ఇంకా సిగ్నల్స్ వస్తున్నాయనీ అయితే.. 85 మిలియన్ డాలర్ల ఈ మిషన్ ముగిసిపోయినట్లేనని స్పష్టంచేసింది. అరుణగ్రహ గురుత్వాకర్షణ, పీడనాల వద్ద హెలికాప్టర్ ఎగరడం సాధ్యపడుతుందా లేదా అని తెలుసుకునేందుకు నాసా ఇంజెన్యుటీని 2021లో పర్సువరెన్స్ రోవర్ మిషన్‌లో భాగంగా ప్రయోగించింది.
భూమిపై కాకుండా మరో గ్రహంపై ఎగిరిన తొలి లోహ విహంగంగా ఇది రికార్డు సృష్టించింది. మన సౌర వ్యవస్థలో ఎగరడానికి అవసరమైన మార్గాన్ని సుగమం చేసింది. తాత్కాలికంగానే పనిచేసేలా ఇంజెన్యుటీని రూపొందించారు. గత 3 ఏళ్లుగా అనుకున్న దానికన్నా మెరుగ్గా ఇది పనిచేసింది. 72 సార్లు మార్స్ వాతావరణంలో ఎగిరింది. మార్స్ మీద 18 కిలోమీటర్లు ప్రయాణించింది. అంగారకుడిపై 79 అడుగుల ఎత్తులో గంటకు 36 కిలోమీటర్ల వేగంతో ఎగిరింది. తొలుత పర్సువరెన్స్ రోవర్‌తో అనుసంధానించబడి ఇది పనిచేసింది. చివరిసారి ఇది ఎగిరినప్పుడు 40 అడుగుల ఎత్తుకు చేరింది. మార్స్ ఉపరితలానికి 3 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు రోవర్‌తో కమ్యూనికేషన్ నిలిచిపోయింది. కాగా.. అంగారకుడిపై ఇంజెన్యుటీ విజయవంతంగా ఎగరడంతో మరో రెండు హెలికాప్టర్లను నాసా 2022లో ప్రయోగించింది..
‘పర్సెవరెన్స్’ రోవర్ ద్వారా 2021 ఫిబ్రవరిలో అంగారక గ్రహంపైకి చేరిన ఈ హెలికాప్టర్ ఇప్పటికే అంచనాలకు మించి పనిచేసినట్టు నాసా పేర్కొన్నది. ఇప్పటివరకు ఇది అరుణ గ్రహ వాతావరణంలో 72 సార్లు ఎగిరిందని, ఇది అనుకున్న దానికంటే 14 సార్లు ఎక్కువని తెలిపింది. ఎత్తుపల్లాలతో ఎగుడుదిగుడుగా ఉండే అంగారక గ్రహ ఉపరితలంపై సరైన ల్యాండింగ్ ప్రదేశాలను తనంతట తానే ఎంపిక చేసుకోగలిగేలా ‘ఇంజెన్యూటీ’ని గత కొన్నేండ్లలో ఎంతో అప్‌గ్రేడ్ చేశామని, దీంతో ఆ హెలికాప్టర్ ఓ సందర్భంలో అరు ణ గ్రహంపై శీతాకాలంలో ధూళి తుఫాను అనంతరం తనంతట తాను శుభ్రం చేసుకోవడంతోపాటు సెన్సర్ సమస్యను కూడా చక్కదిద్దుకోగలిగిందని నాసా వివరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com