AI WONDER: AI కలిపింది ఇద్దరినీ..

ఎలాన్ మస్క్(Elon Musk).. జుకర్ బర్గ్ టెక్ ప్రపంచంలో వీరిద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతోంది. ఇటీవలే కేజ్ ఫైట్‌కు సై అంటే సై అంటూ ఇద్దరూ సవాల్ ప్రతి సవాల్ విసురుకున్నారు. టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే అంటూ జుకర్‌బర్గ్.. మస్క్‌ను కవ్వించాడు కూడా. అనంతరం యుద్ధ విద్యలో నేర్చుకుంటున్నట్లు ఇన్ స్టాలో పోస్ట్ కూడా చేశాడు జుకర్‌బర్గ్. ట్విటర్ (Twitter) వ్యాపార రహస్యాలు, మేధో సంపత్తిని చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేసి జుకర్‌బర్గ్(Mark Zuckerberg) థ్రెడ్స్‌ను తీసుకొచ్చాడని మస్క్ కూడా తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇలా వీరిద్దరి మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమంటోంది. ట్విట్టర్‌తో మస్క్, థ్రెడ్స్ యాప్‌తో జుకర్‌బర్గ్ సోషల్ మీడియాను ఏలేయాలని ప్రణాళికలు రచిస్తున్నారని నెటిజన్లు భావిస్తున్న వేళ.. ఈ దిగ్గజ వ్యాపారవేత్తలు కలిసి బీచ్‌లో సరదాగా గడిపారు.
ట్విట్టర్ (Twitter) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk), మెటా (Meta) సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) బీచ్‌లో సరదగా గడిపారు. వీళ్లిద్దరూ ఎప్పుడు కలిశారా అనే కదా మీ డౌటానుమానం. ఎప్పుడంటే వీళ్లు నిజంగా కలవలేదు. మీ ఇద్దరు భౌతికంగా కలవకపోతే మాకేంటి అని ఓ ట్విట్టర్ యూజర్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో వారద్దరిని కలిపేశాడు. కృత్రిమ మేధతో వాళ్లిద్దరూ కలిసి దిగినట్టుగా ఫొటోలు సృష్టించాడు. ఆ ఫొటోలకు గుడ్ ఎండింగ్ అనే క్యాప్షన్ జోడించి ట్విటర్‌లో షేర్ చేశాడు. ఆ ఫొటోల్లో మస్క్, జుకర్‌బర్గ్ ఇద్దరూ బీచ్‌లో హాయిగా నవ్వుతూ భుజాలపై చేతులు వేస్తూ సరదగా ఫోటోషూట్‌లో పాల్గొన్నట్లు ఉంది.
ఈ కుబేరులు ఇద్దరు బీచ్‌లో నడుస్తున్నట్టుగా, ఒకరిని ఒకరు కౌగిలించుకున్నట్లుగా, ఇద్దరూ కలిసి బీచ్‌లో పరుగులు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఆ ఫొటోలను క్రియేట్ చేశారు. ఈ ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేసిన కొద్దిసేపటికే దాదాపు 80 లక్షల మంది వీక్షించారు. మరో లక్ష మందికి పైగా లైక్ చేశారు. ఈ ఫొటోలు వైరల్ కావడంతో ఎలాన్ మస్క్ కూడా స్పందించాడు. నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చారు.
ఇక ఈ ఫొటోలపై నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి వాళ్లు మీమ్స్ కోసం ఇలా కలిసి ఫోటోషూట్ చేయాలని ఒకరు, వావ్ కపుల్ గోల్స్’ అని మరొకరు కామెంట్స్ చేశారు. మస్క్ ఈ రోజు మెటాను కొనుగోలు చేశారా ఏంటీ అని నెటిజన్ స్పందించాడు. ‘బీచ్‌లో ఒకరినొకరు చూసుకొని, కౌగిలించుకుని, చిన్న పిల్లల్లా చెప్పులు లేకుండా పరిగెత్తుతున్నారు’ అని ఇంకో నెటిజన్ రియాక్ట్ అయ్యాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com