South Korea: దక్షిణ కొరియాలో తప్పిన ఘోర ప్రమాదం

South Korea:  దక్షిణ కొరియాలో తప్పిన ఘోర ప్రమాదం
X
176 మందికి తృటిలో తప్పిన ప్రమాదం..!

దక్షిణ కొరియాలో విమాన ప్రమాదం తప్పింది. విమానాశ్రయం నుంచి బయలుదేరే ముందు విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై.. మంటలను ఆర్పేశారు. దీంతో ప్రయాణికులంతా క్షేమంగా బయటకు దించేశారు. ఒకరు స్వల్పంగా గాయపడ్డారు.

దక్షిణ కొరియాలోని ఎయిర్ బుసాన్‌కి చెందిన విమానం గిమ్‌హే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌కు సిద్ధపడుతుండగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి. విమానం తోక భాగం నుంచి మంటలు చెలరేగాయి. విమానంలో 169 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. మంటలు అంటుకోగానే విమానం మొత్తం ఖాళీ చేయించారు. అయితే ఒకరికి స్వల్ప గాయాలు అయినట్లు పేర్కొన్నారు. గాయపడ్డ వ్యక్తిని అస్పత్రికి తరలించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. విమానం లోపల మంటలు చెలరేగాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. విమానం తోకలో ప్రారంభమైందని దక్షిణ కొరియాకు చెందిన యోన్‌హాప్ వార్తా సంస్థ తెలిపింది. విమానంలో అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. గత నెల 29న థాయిలాండ్‌ నుంచి మువాన్ వెళ్లాల్సిన బోయింగ్‌ 737-800 జెజూ విమానం కుప్పకూలింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 181 మంది ప్రయాణికులు, క్రూ సిబ్బందిలో 179 మంది మృత్యువాత పడ్డారు.

Tags

Next Story