Air India: స్వీడన్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్....

Air India: స్వీడన్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్....
X
నెవార్క్ నుంచి ఢిల్లీ బయలుదేరిన ఫ్లైట్; మధ్యలోనే ఆయిల్ లీక్; స్వీడెన్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్...

ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో సాంకేతిక లోపం వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అమెరికాలోని నెవార్క్ నుంచి ఢిల్లీ బయలుదేరిన AI106 ఫ్లైట్ లో 300 మంది ప్రయాణీకులు ఉన్నారు. స్వీడన్ లోని స్టాక్ హోమ్ చేరుకునే సరికి విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఇంజిన్ లో ఆయిల్ లీకేజీని గుర్తించిన సిబ్బంది హుటాహుటిన స్వీడన్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సిబ్బంది అప్రమత్తతతోనే పెను ప్రమాదమే తప్పిందని తెలుస్తోంది. ఫ్లైట్ లో ఉన్న 300 మంది ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారని డైరెక్టర్ జెనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారి వెల్లడించారు.



Tags

Next Story