AirIndia: ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఎయిర్ ఇండియా విమానంలో మంటలు చెలరేగాయి. అబుదబీ నుంచి భారత్ కు వస్తున్న విమానంలో ఈ ప్రమాదం సంభవించింది. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ B737 - 800 ఎయిర్ క్రాఫ్ట్ VT-AYC ఆపరేటింగ్ ఫ్లైట్ IX 348 టేకాఫ్ అయిన కాసేపటికే మంటలు అంటుకున్నట్లుగా సిబ్బంది గుర్తించారు. 100 అడుగుల ఎత్తులో ఉండగా ఒక ఇంజన్ లో సాంకేతిక సమస్య ఏర్పడి మంటలు చెలరేగాయని తెలిపారు. అప్రమత్తమైన పైలట్ వెంటనే అబుదబీ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా తెలిపింది. విమానంలో మొత్తం 184 మంది ప్రయాణికులు ఉన్నారు. శుక్రవారం ఉదయం అబుదబీ నుంచి కాలికట్ ( కోజికట్ ) బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో అగ్నిప్రమాదం సంభవించడంతో ప్రయాణికులందరు భయభ్రాంతులకు గురయ్యారు. విమాన సిబ్బంది సకాలంలో ప్రమాదాన్ని గుర్తించగా, పెద్ద విపత్తు నుంచి బయడ్డామని ప్రయాణికులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com