Gulf Airlines: పాస్‌పోర్ట్‌లో ఇంటి పేరు లేదని విమానాన్ని ఎక్కనివ్వలేదు

ఇంటిపేరు లేకపోవడంతో ఓ వ్యక్తిని ఏకంగా ప్లైట్ ఎక్కకుండా చేశారు ఎయిర్ పోర్ట్ సిబ్బంది. అతని పాస్‌పోర్ట్‌లో ఒకే పేరు ఉన్నందున మాస్కో విమానాశ్రయంలో గల్ఫ్ ఎయిర్ విమానం ఎక్కకుండా ఆపేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. పాస్‌పోర్ట్‌లో ఇంటిపేరు లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే, న్యాయవాది అయిన వ్యక్తిని విమానం ఎక్కనివ్వలేదు విమానయాన సిబ్బంది. ఆ వ్యక్తి తన గురించి చెప్పుకుని తాను ఇప్పటికీ అనేక సందర్బాల్లో విమాన ప్రయాణం చేశానని ఎంతగా చెప్పినప్పటికీ సిబ్బంది నిరాకరించారు. తమిళనాడు మాజీ ఎమ్మెల్యేకు ఈ చేదు అనుభవం ఎదురైంది. పాస్‌పోర్ట్‌లో ఇంటిపేరు లేకపోవడంతో తమిళనాడుకు చెందిన మాజీ ఎమ్మెల్యే, న్యాయవాది అయిన నిజాముద్దీన్‌ను గల్ఫ్ ఎయిర్ మాస్కో ఎయిర్‌పోర్టులో బోర్డింగ్‌కు నిరాకరించింది. దీంతో ఆయన చెన్నైలోని వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. దీంతో గల్ఫ్ ఎయిర్ తన తప్పిదాన్ని గుర్తించి నిజాముద్దీన్‌కు పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. టికెట్ ఖర్చు, మానసిక వేదనకు కలిపి ప్రయాణ తేదీ నుండి సంవత్సరానికి రూ.1.4 లక్షలు 9శాతం వడ్డీతో చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.
గల్ఫ్ ఎయిర్ సిబ్బంది పాస్‌పోర్ట్‌లో రెండు పదాలు ఉండాలనే నిబంధనను ఉదహరించారని, దీని వల్ల చెక్-ఇన్ తర్వాత అతను చిక్కుకుపోయాడని తెలుస్తోంది. తరువాత అతను అదే పాస్‌పోర్ట్‌ని ఉపయోగించి ఎయిర్ అరేబియాలో టికెట్ బుక్ చేసుకున్నాడు. గల్ఫ్ ఎయిర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (చెన్నై నార్త్) ముందు వాదించింది. వారు కేవలం UAE నవంబర్ 2022 నోటిఫికేషన్‌ను అనుసరించారని, మొదటి, చివరి పేరు రెండింటినీ తప్పనిసరిగా పేర్కొనాలని కోరారు. ఒకే పదం పాస్‌పోర్ట్ పేరు ఉన్న ప్రయాణీకుడిని ఎక్కించలేమని ఎయిర్‌లైన్ పేర్కొంది, ఎందుకంటే అలాంటి ప్రయాణికులను UAE ప్రవేశ చట్టాల ప్రకారం ‘అనుమతించబడరు’ అని భావిస్తారు. నిజాముద్దీన్‌తో పాటు వచ్చిన మరొక ప్రయాణీకుడు అవసరమైన పేరు ఫార్మాట్‌ను కలిగి ఉన్నాడని తెలిపింది. దీంతో అతడిని అదే విమానంలో పంపించామని వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

