Royal Couple: విడాకులు తీసుకుంటున్న రాజు దంపతులు

అల్బేనియా యువరాజు దంపతులు తమ వివాహ బంధానికి స్వస్తి పలకనున్నారు. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఐరోపా దేశమైన అల్బేనియాకు చెందిన క్రౌన్ ప్రిన్స్ లేక, క్రౌన్ ప్రిన్సెస్ ఎలియా రaరాయా 2016లో వైభవంగా వివాహం చేసుకున్నారు. 2020 లో వారికి ఓ కుమార్తె జన్మించింది. ఎనిమిదేళ్ల వైవాహిక బంధాన్ని కొనసాగించే వీలులేకపోవడంతో తాము విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు లేక తెలిపారు. పరస్సర అంగీకారంతోనే మేమిద్దరం విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మా కుమార్తెకు సంతోషకరమైన జీవితాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నాం అని వెల్లడించారు.
పరస్పర అంగీకారంతోనే తాము చట్టబద్దమైన ప్రక్రియతో విడిపోవాలని నిర్ణయించుకున్నా మని, తమ కుమార్తెకు సంతోషకరమైన, సురక్షితమైన జీవితాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ సమయంలో తమ గోప్యతకు భంగం కలిగించొద్దని, కుటుంబ విలువలు ఎంతో గొప్పవని తాను బలంగా నమ్ముతానని ఎలియా అన్నారు. ఈ నిర్ణయం తనకు ఏమాత్రం సంతోషం కలిగించేది కాదని, అయితే కొన్నిసార్లు విడిపోవడమే సరైన ఎంపిక అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
41 ఏళ్ల యువరాజు లేక అల్బేనియా ప్రభుత్వంలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. గాయని, నటి అయిన ఎలియా.. అల్బేనియన్‌కు నేషనల్ థియేటర్ తరఫున ప్రదర్శనలు ఇచ్చిన అనుభవం ఉంది. 1928 నుంచి 1939 వరకూ అల్బేనియా రాజుగా ఉన్న కింగ్ జోగ్ 1 మనమడైన లేక.. 2011లో తండ్రి లేక- 1 మరణం తర్వాత యువరాజుగా పట్టాభిషక్తుడయ్యారు. ఎలియా, లేక మొదటిసారి 2008లో కలుసుకోగా.. 2010 నుంచి ప్రేమలో ఉన్నారు. తర్వాత 2016లో వీరికి వివాహం జరిగింది. పెళ్లైన నాలుగేళ్లకు 2020లో పాప పుట్టింది. ఆ పాపకు లేక తన నాయినమ్మ రాణి గెరాల్డైన్ పేరు పెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com