Aliens Row : అరె.. మస్క్.. మళ్లీ వేసేశాడు...!

Aliens Row :  అరె.. మస్క్.. మళ్లీ వేసేశాడు...!
X
అమెరికాలో గ్రాహాంతర వాసుల ఉనికిపై ఎలాన్ మస్క్ ట్వీట్; నా ఫ్రెండ్స్ వచ్చారంటూ చమత్కారం....

టెస్లా సీఈఓ, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్... మరోసారి ట్వీట్ చేశాడు. కరెంట్ అఫైర్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టే మస్క్ తాజాగా అమెరికాలో చోటుచేసుకుంటోన్న వింత ఘటనలపై స్పందించాడు. ఇలాంటి సంఘటనలకు ఏ మాత్రం భయపడవద్దని ఎలాన్ తన ఫాలోవర్లకు అభయం ఇచ్చాడు. అంతరిక్షం నుంచి తన స్నేహితులు వచ్చారని ఇందులో భయపడాల్సిందేమీ లేదని చమత్కరించాడు. ఇటీవల కాలంలో అమెరికా గగనతలంలో కొన్ని వింత ఆకృతులు తారసపడటం, వాటిని నావిక దళం కూర్చి వేయడం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో గ్రహాంతరవాసుల కదలికలపై మరోసారి పెద్ద చర్చే సాగుతోంది. వారి ఉనికిని కొట్టిపారేయలేమని ఆమెరికా నావికా దళం సైతం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ క్రమంలోనే మస్క్ ట్వీట్ కు విపరీమైన క్రేజ్ నెలకొంది. దీంతో ఇదికాస్తా వైరల్ గా మారింది.

Tags

Next Story