Pakistan: అల్లానే సాక్షి... నేను సంతకం చేయలేదు

పాకిస్థాన్ మాజీ విదేశాంగమంత్రి, పాక్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ ఛైర్మన్ ఇమ్రాన్‌ఖాన్(imran khan) సన్నిహితుడు షా మెహమూద్ ఖురేషీని పోలీసులు అరెస్టు చేయడం దాయాది దేశంలో ప్రకంపనలు రేపుతోంది. అధికారిక రహస్యాల చట్టం కింద ఖురేషీని పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఈ సంచలనాలను కారణమైంది. చట్టంగా రూపొందిన అధికార రహస్యాల, పాక్ సైన్య చట్టాల సవరణ బిల్లుల(Official Secrets Amendment Bill 2023)పై తాను సంతకాలు చేయలేదని ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ( Pakistan President Arif Alvi) బాంబు పేల్చారు. అల్లా సాక్షిగా( As God is my witness) తాను అధికారిక రహస్యాల సవరణ బిల్లులపై తాను సంతకం చేయలేదని.. వీటితో విభేదించానని ఆరిఫ్ అల్వీ స్పష్టం చేశారు. సంతకం చేయని ఆ బిల్లులను నిర్దిష్ట సమయంలో తిరిగి పంపమని తాను పార్లమెంట్‌కు చెప్పానని వెల్లడించారు. కానీ తన సిబ్బందే తనను మోసం చేశారని..తన అధికారాన్ని వాళ్లు లెక్క చేయలేదని ఆరిఫ్ అల్వీ వెల్లడించారు.
ఆరిఫ్ అల్వీ ప్రకటనను పాక్ న్యాయ మంత్రిత్వశాఖ( Pakistan Law Ministry) ఖండించింది. రాజ్యాంగంలోని అధికరణం 5 కింద నిర్దిష్ట సమయంలో బిల్లుల( Official Secrets Amendment Bill 2023 & Pakistan Army Amendment Bill 2023)ను అధ్యక్షుడు పంపించలేదని.. అందుకే అవి చట్టాల కింద మారాయని పేర్కొంది. ఇమ్రాన్‌ఖాన్‌కు ఆరిఫ్ అల్వీ సన్నిహితుడని పేరు ఉంది. ఈ అధికార రహస్యాల చట్టం ప్రకారమే ఇమ్రాన్ మరో సన్నిహితుడు షా మహమ్మద్ ఖురేషీని పోలీసులు అరెస్టు చేశారు. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ-FIA కేంద్ర కార్యాలయానికి తరలించారు. విదేశాంగ మంత్రిగా పనిచేసినప్పుడు ఖురేషీ అమెరికాలోని పాక్ రాయబార కార్యాలయానికి పంపిన అధికారిక కేబుల్ రహస్యాన్ని ఉల్లంఘించినట్లు అభియోగాలు ఉన్నాయి. దౌత్యపరమైన ఈ కేబుల్ కనిపించకుండా పోయిన ఘటనలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాత్రపై కూడా FIA విచారణ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖురేషీని అరెస్టు చేశారని తెలుస్తోంది. తనను ప్రధాని పీఠం నుంచి దించడం వెనుక విదేశీ శక్తుల కుట్ర ఉందని గతంలో ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఇందుకు సాక్ష్యంగా అమెరికా అధికారులకు ఆ దేశంలోని పాక్ రాయబారికి మధ్య సమావేశాన్ని ప్రస్తావించారు.
ఈ క్రమంలోనే పాక్ సైన్యం(Pakistan Army ) ఇమ్రాన్‌కి రెండు ఆప్షన్స్ ఇచ్చినట్టుగా వార్తలు చెలరేగుతున్నాయి. రాజకీయాల నుంచి తప్పుకోవడమో లేదంటే ఉరిశిక్షకు సిద్ధం కావడమో నిర్ణయించుకోవాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com