Papua New Guinea: పప్వా న్యూ గునియాలో గిరిజన తెగల మధ్య ఘర్షణ

పపువా న్యూ గినియాలో చెలరేగిన గిరిజన హింసాకాండలో పదుల సంఖ్యలో గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. పర్వత శ్రేణుల్లో ఉండే అంబులిన్, సికిన్ అనే రెండు గిరిజన తెగల మధ్య ఘర్షణ జరిగింది. ఓ దళం తమ వద్ద ఉన్న ఆయుధాలతో.. మరో తెగపై ఫైరింగ్ చేసింది. ఎంగ్వా ప్రావిన్సులో ఈ రక్తపాతం చోటుచేసుకున్నది. సోమవారం ఉదయం నాటికి వాపెనమండలోని రోడ్డు పక్కన, కొండలపై తొలుత 64 మృతదేహాలు కనిపించాయని తెలిపిన ఆస్ట్రేలియా మీడియా- ఆ తర్వాత ౫౩ మంచి చనిపోయారని ప్రకటించింది. పర్వత ప్రాంతాల్లోచాలాకాలం నుంచి వర్గ పోరు నడుస్తోంది. అయితే గత వారం చివరలో జరిగిన హింస మరీ దారుణమని అధికారులు చెబుతున్నారు.
అక్రమంగా ఆ దీవిలో ఆయుధాలు వచ్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాల్పులకు దుండగులు ఎస్ఎల్ఆర్, ఏకే-47, ఎం4, ఏఆర్ 15 రైఫిల్స్ ఉపయోగించినట్టు చెబుతున్నారు. దీంతో స్థానిక గిరిజన తెగల మధ్య ఘర్షణ మరింత తీవ్రంమైందని సమాచారం. రాజధాని పోర్ట్ మోర్సీబీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాబాగ్ పట్టణంలో ఎక్కడ చూసినా మృతదేహాలు కనపడుతున్నాయి. మృతదేహాలను ట్రక్కుల్లో తరలిస్తున్నామని, ఈ హింసాకాండలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించామని పపువా న్యూ గినియా అధికారులు ఆస్ట్రేలియా మీడియాకు తెలిపారు. గిరిజనుల పోరు ఉద్ధృతమవుతోందన్న హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. పపువా న్యూ గినియాలో హింసాకాండపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని ఆల్బనీస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తనను ఆ వార్త కలిచివేసిందని చెప్పారు. పపువా న్యూ గినియాకు సహాయం చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
పాపువా న్యూ గినియాలోని ఉత్తర ఐలాండ్స్‌లో గిరిజనుల సమూహాలు ఎక్కువగా ఉంటాయి. అయితే.. వీరు పొరుగు ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉంటారు. దీంతో ఈ జాతుల మధ్య భూమి, వ్యవసాయం, ఆహారం, ఆధిపత్యం విషయంలో తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ సుక్షేత్రంగా ఉన్న ఎంగా ప్రావిన్స్‌లో గిరిజనుల మధ్య వివాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఓ రెండు తెగల మధ్య తాజాగా ఆకస్మిక దాడి జరిగింది. ఈ దాడుల్లో పురుషులు ఎక్కువ మంది మరణించినట్లు ఆస్ట్రేలియన్ అధికారిక మీడియా తెలిపింది.
గిరిజన జాతుల మధ్య జరిగిన దాడిలో ఇదే అతి దారుణమైన ఘటన అని దేశ పోలీసు దళంలో సీనియర్ అధికారి జార్జ్ కాకాస్ చెప్పారు. అయితే, పసిఫిక్ దేశం వందలాది తెగలకు నిలయంగా ఉంది.. వీరిలో చాలా మంది ఇప్పటికీ మారుమూల భూభాగంలో నివసిస్తున్నారు. ఇక, గత సంవత్సరం ఎంగా ప్రావిన్స్‌లో 60 మందిని చంపిన ఘర్షణలకు కారణమైన అదే తెగలకు చెందిన వారు తాజా హింసలో పాల్గొన్నారని అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ హింసాకాండలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించామని పపువా న్యూ గినియా అధికారులు తెలిపారు. ట్రక్కుల్లో మృతదేహాలను తరలించినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. గిరిజనుల పోరు ఉద్ధృతమవుతోందన్న హెచ్చరికలు ఉన్నాయని ఎంగా గవర్నర్ పీటర్ ఇపాటాస్ తెలిపారు. తగిన చర్యలు తీసుకోవాలని భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com